శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి): 

   

పోరంకి గ్రామం, పెనమలూరు మండలం, కృష్ణా జిల్లా కు చెందిన శ్రీ పోతర్లంక దేవకీ నందన ప్రసాద్ గారి భార్య  పోతర్లంక శివ కుమారి గారు మొవ్వ గ్రామములో వారికి చెందిన సుమారు రూ.7,80,000/- లు విలువజేయు 65 సెంట్ల వ్యవసాయ భూమిని శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి శ్రీ అమ్మవారికి కానుకగా సమర్పించియున్నారు. 

    ఆలయ అధికారులు దాత కుటుంబం నకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ వేదపండితులు వీరికి వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.

Comments