*వారానికి ఐదు పని దినాలు మరో ఏడాది పొడిగింపు*
అమరావతి, జూలై 30 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి ఐదు పని దినాలు విధానాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 27 నుండి మరో ఏడాది పాటు వారానికి ఐదు పని దినాలు విధానం అమల్లో ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ గురువారం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య.58 ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, కార్పొరేషన్లలలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అమరావతి రాజధాని ప్రాంతంలోని ఇతర ప్రభుత్వ సంస్థలు ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేసే విధంగా వారానికి ఐదు పని దినాల విధానం వర్తిస్తుందని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.
addComments
Post a Comment