ఈనెల11వతేదీనుండిజరిగేనిరువధికసమ్మెను విజయవంతం చేయండి

 మంగళగిరి (ప్రజా అమరావతి);


*ఈనెల11వతేదీనుండిజరిగేనిరువధికసమ్మెను  విజయవంతం చేయండి* ఏఐటీయూసీ,సీఐటీయూ ,

స్వతంత్ర మునిసిపల్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో  మ్యూనిపల్ కార్మికుల సమస్యల పరిస్కారం కోసం

ఈ నెల11వతేదీ నుండి నిరవధిక సమ్మె కార్యక్రమం విజయవంతం చేయాలని

కోరుతూమంగళవారంమంగళగిరి శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ భవన్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో

ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మంగళగిరి అధ్యక్షులు నందం బ్రహ్మేశ్వరరావు,అధ్యక్షతన సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మంగళగిరి అధ్యక్షులు అన్నవరపు ప్రభాకర్,సీఐటీయూ నాయకులు చెంగయ్య మాట్లాడుతూ 7 వతేదిన మున్సిపల్ కార్మికులతో ప్రదర్శన 9వ తేదిన బైక్ ర్యాలీ జరుగుతుందని అన్నారు.11 వ తేదినుండి జరిగే నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.కావున కార్మికులు ప్రజలు సహకరించి జయప్రదంచేయాలని కోరారు.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మంగళగిరి కార్యదర్శి గండికోట దుర్గారావు, సీఐటీయూ నాయకులు,కమలాకర్,

కుర్రా ఏడుకొండలు తదితర యూనియన్ నాయకులుకార్మికులు తులసి,రాయుడు,

హరిబాబు,నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments