సిపిఐ జాతీయ,రాష్ట్ర, జిల్లా, మహాసభలు విజయవంతం చేయండి

 మంగళగిరి (ప్రజా అమరావతి);


*సిపిఐ జాతీయ,రాష్ట్ర, జిల్లా, మహాసభలు విజయవంతం చేయండి


.*


*సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పిలుపు* 


సిపిఐ జాతీయ మహాసభలు విజయవాడలో అలాగే ఆగస్టులో రాష్ట్ర పార్టీ మహాసభలు విశాఖపట్నంలో జరుగుతాయిని,అలాగే జిల్లా

మహాసభ ఈ నెల 23,24, తేదీలలో జరగబోతున్నాయని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు.

మంగళవారం సాయంత్రం చినకాకని గ్రామ శాఖ

మహా సభ మంగళవారం గండికోట శివశంకర్ రావు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు, ఈనెల 23వ తేదీ తుళ్లూరులో ప్రదర్శన బహిరంగ సభ 24వ తేదీ ప్రతినిధులసభ  జరగబోతుందని అన్నారు. నేటి రాజకీయాలలో విలువలు పతనమయ్యాయని రాజకీయాలలో నైతికత లేని దశ కనబడుతుందని అన్నారు. రాష్ట్రంలో ఇంటి పన్ను చేత పన్ను నీటి పన్ను పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఎక్కడో ఒకచోట ఏదో ఒక రూపంలో నిరసన గలాన్ని విప్పి తిరుగుబాటు బహుట ఎగురవేసిన ఘనత కమ్యూనిస్టుల దేనని అన్నారు,భారతీయ జనతా పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు.రానున్న రోజుల్లో సిపిఐ పార్టీని మరింత బలోపేతం చేయవలసిన అవసరం మనందరి పైన ఉందని అన్నాడు, దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా నిలిచి వీరోచితంగా పోరాడే ఏకైక పార్టీ సిపిఐ అని అన్నారు,కుబేర్లకు మోడీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులన్నీ కట్టబెడుతున్నారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో పై మోయలేని భారం పడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సిపిఐ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శిచిన్నితిరుపతయ్య,

సహాయ కార్యదర్శులు  కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు,మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, మాజీ సర్పంచ్ కుక్కమల్ల నాగేశ్వరరావు,మంగళగిరి నియోజకవర్గ aiyf కార్యదర్శి ఇంటూరిగోపి,సాంబయ్య,టి.వీరనారాయణ,మరియదాసు,జె,ఎస్.దాసు, తదితరులు పాల్గొన్నారు.అనంతరంచినకాకానిశాఖకార్యదర్శిగా,జేసుదాసుని ఎన్నుకోవడం జరిగింది.

Comments