రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి

 

నెల్లూరు, జూలై 28 (ప్రజా అమరావతి) : రాష్ట్ర విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ఏకైక ముఖ్యమంత్రి


దేశంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని  రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ పాసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

 గురువారం ఉదయం మనుబోలు మండలం బద్వేలు వెంకన్నపాలెం గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. తొలుత నాడు నేడు మొదటి విడత కింద రూ 17 లక్షలతో  నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను, ఈ పాఠశాలలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం  జడ్పీ పాఠశాలలో  నాడు నేడు రెండో విడత కింద 69 లక్షల రూపాయలతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 

 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులకు ఏం కావాలో ప్రత్యేకంగా ఆలోచించే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నాడు నేడు కింద అత్యాధునిక వసతులతో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చి, జగనన్న విద్యా దీవెన, గోరుముద్ద, అమ్మఒడి వంటి పథకాలతో విద్యావ్యవస్థలో ఎవరు ఊహించనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క పేద విద్యార్థి చదువుకు భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందన్నారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా పాఠశాలల విలీనం ప్రక్రియను మొదలుపెట్టామని, అయితే ఇందులో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఎక్కువ దూరం ఉన్న పాఠశాలలను విలీనం చేయకుండా కేవలం ఒక కిలోమీటర్ దూరం ఉన్న పాఠశాలను మాత్రమే విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. 

 ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ, జెడ్ పి టి సి అనితమ్మ, బద్వేలు వెంకన్నపాలెం సర్పంచ్ శ్రీ శశి కుమార్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీ వెంకటయ్య, సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీమతి రమాదేవి, ఏ ఎస్ డబ్ల్యూ ఓ ప్రసూన, జడ్పీ పాఠశాల హెచ్ఎం మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. 


Comments