ప్లీనరీ సమావేశాలతో రాష్ర్టం అంతటా పండుగ వాతావరణం కనపడాలి.

 ఈ నెల 8, 9 తేదీల‌లో జ‌రిగే

ప్లీన‌రీ స‌మావేశాల‌ను విజ‌య‌వంతం చేయండి


 ప్లీనరీ సమావేశాలతో రాష్ర్టం అంతటా పండుగ వాతావరణం కనపడాలి.
 ప్లీనరీకి హాజరయ్యే ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం.


ప్లీనరీ నిర్వహణకు సంబంధించి అన్ని కమిటీలు భాద్యతగా పనిచేయాలి.


 ప్రతి కార్యకర్త గర్వపడేలా ప్లీనరీ నిర్వహణ.

తాడేపల్లి (ప్రజా అమరావతి);

         ఈనెల 8,9 తేదీలలో గుంటూరులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి అన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్లీనరీ సమావేశాలకు సంబంధించి ముఖ్యనేతల సమావేశం సోమవారం జరిగింది.సమావేశంలో శ్రీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్లీనరీ సమావేశాలను పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని వివరించారు. ప్లీనరీ నిర్వహణ కమిటీలకు సంబంధించి నియమితులైన సీనియర్ నేతలందరూ ప్లీనరీ నిర్వహణలో భాగస్వాములై పనిచేయాలని కోరారు. ఆయా కమిటీలకు సంబంధించి సభ్యులతో సమావేశమై వారి భాగస్వామ్యంతో వారికి అప్పగించిన బాధ్యతలను చూడాలని సూచించారు. ఇప్పటికే నియోజకవర్గ,జిల్లా స్దాయి ప్లీనరీలు కార్యకర్తల ఉత్సాహాల మధ్య విజయవంతంగా నిర్వహించుకున్నామని తెలియచేశారు. ఇదే ఉత్సాహాన్ని ప్లీనరీ సమావేశాలలో కూడా చూపించాలని అభిలషించారు.


             పార్టీ రీజనల్ కోఆర్డినేటర్,టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ  శ్రీ వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అధికారం చేపట్టాక జరుగుతున్న ప్లీనరీ సమావేశం కాబట్టి ఇవి ఎంత విజయవంతంగా జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి,ప్రభుత్వానికి అంత మంచిపేరు వస్తుంది కాబట్టి ప్రతి కార్యకర్త ఇందులో పాల్గొనేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే ఎన్నో పధకాలు ప్రజలకు మేలు చేసేలా అమలు చేస్తున్నాం. రాబోయే రెండేళ్ల కాలంలో మరింత మెరుగ్గా పనిచేసి ప్రజలకు మరింత చేరువ అయ్యేలా ఏమి చేయగులుగుతామో చెప్పడం దిశా నిర్దేశం చేయడం జరుగుతుంది. గ్రామస్ధాయినుంచి జడ్ పి ఛైర్మన్ ల వరకు, ఎంపిటిసి,జడ్ పి టి సిలు  వార్డు మెంబర్ స్ధాయినుంచి సర్పంచ్ స్ధాయి వరకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు.ప్లీనరీ సమావేశాలకు హాజరయ్యేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. అయా కమిటీల కన్వీనర్లుగా నియమితులైనవారు ఆ కమిటీల సభ్యులతో సమావేశాలు నిర్వహించి వారి బాధ్యతలను నెరవేర్చేలా పనిచేయాలని సూచించారు.


       పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ  ప్లీనరీ నిర్వహణ కమిటీలలో ఉన్న పార్టీ సీనియర్ నేతలు,సీనియర్ కార్యకర్తలు పార్టీ ప్లీనరీ సమావేశాలను ఘనంగా నిర్వహించుకునేలా భాగస్వాములు కావాలన్నారు. రాష్ర్టంలోని స్దానికసంస్ధలనుంచి పార్లమెంట్ సభ్యుల వరకు దాదాపు 80 శాతం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్ధితులలో జరుగుతున్న ప్లీనరీ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటోందని తెలియచేశారు. ఇది ఓ పెద్ద పండుగ.పెద్ద సమీక్ష అని అన్నారు.రెండు రోజుల ప్లీనరీ సమావేశాలకు రాష్ర్టం నలుమూలలనుంచి కార్యకర్తలు హాజరవుతారు.ఐదేళ్ల తర్వాత జరుగుతున్న పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ గర్వపడేలా రీతిలో నిర్వహించుకోవాలన్నారు. కార్యకర్తలకు అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యతను ఆయా కమిటీల కన్వీనర్లు తీసుకోవాలన్నారు. వసతి,బోజనం,రవాణా వంటివాటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఇక పార్టీ ప్లీనరీలో వివిధ అంశాలను సమీక్షించడం,తీర్మానాలు,అజెండా ఇవన్నీ కూడా చక్కగా నిర్వహించేందుకు ఎక్సర్ సైజ్ జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ సందేశం అందరికి అందేలా చేయడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలన్నారు.


      ప్లీనరీ నిర్వహణ  కమిటీ కన్వీనర్,రాష్ర్ట విద్యాశాఖమంత్రి శ్రీ బొత్స సత్యన్నారాయణ మాట్లాడుతూ 2017లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నసమయంలో ప్లీనరీ సమావేశాలు జరుపుకున్నాం. ఆనాటి ప్లీనరీ సమావేశాలకు నేటి సమావేశాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. నేడు అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ సమావేశాలు నిర్వహించుకుంటున్నామని వివరించారు. ప్రజల అంచనాలు అధికంగా ఉంటాయి. తమ అభివృధ్దికి,రాష్ర్ట అభివృధ్దికి ప్లీనరీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తుంటారు.ఎంతో భాద్యతగా అంకితభావంతో పనిచేసి ప్లీనరీ సమావేశాలను నిర్వహించుకుంటే బాగుంటుందన్నారు. ఏ ఏ కమిటీలకు సంబంధించి నియమితులైన వారందరూ ప్రజలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు,ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడించేలా పనిచేయాలన్నారు. ముఖ్యంగా మన ఇంట్లో  వేడుక జరుగుతుంటే ఏ విధంగా బాధ్యతగా అందరికి అన్నీ సౌకర్యాలు సమకూర్చేవిధంగా పనిచేస్తామో అదే రీతిలో పనిచేయాలని అన్నారు.

   


ప్లీనరీ సమావేశ ప్రాంగణంలో రక్తదాన శిబిరం

రక్తదాతలకోసం ఆన్ లైన్ రిజిస్ర్టేషన్--వెబ్ సైట్ ఆవిష్కరణ

       వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ప్రాంగణంలో రక్తదాన శిబిరం పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆన్ లైన్ రిజిస్ర్టేషన్ కోసం 

 ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించింది.  http://ysrcpblooddonation.com/  ఈ వెబ్ సైట్ ను     పార్టీ జాతీయప్రధాన కార్యదర్శి,రాజ్యసభసభ్యులు శ్రీ వి.విజయసాయిరెడ్డి,రాష్ర్ట ప్రధానకార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి,పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ శ్రీ వైవి సుబ్బారెడ్డి,పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ర్ట మంత్రులు శ్రీ బొత్స సత్యన్నారాయణ, మంత్రి సీదిరి అప్పల్రాజు,సిహెచ్ వేణుగోపాలకృష్ణ,గుడివాడఅమర్ నాధ్,దాడిశెట్టి రాజా,పార్టీ శాసన సభ్యులు శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి,కొలుసు పార్థ సారధి  తదితర సీనియర్ నేతలు ఆవిష్కరించారు.


     ప్రతి నియోజకవర్గం నుంచి రక్తదానం చేయాలనే ఆసక్తి ఉన్న కార్యకర్తలు వెబ్ సైట్ లోకి లాగిన్ అయి రిజిస్టర్ డోనేట్ అనే బటన్ క్లిక్ చేసిన అనంతరం రక్తదాత వివరాలు (పేరు,మొబైల్ ఫోన్ నెంబర్,బ్లడ్ గ్రూప్,నియోజకవర్గం,రక్తదానం చేసే తేదీ) నమోదు చేయడం ద్వారా ఆన్ లైన్ లో రిజిస్ర్టేషన్ ప్రక్రియ ముగస్తుంది.


       రక్తదానం చేయండి---ప్రాణాలు కాపాడండి అనే ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారి ఆశయాలకు అనుగుణంగా ఈ వెబ్ సైట్ రూపొందించామని పార్టీ సోషల్ మీడియా రాష్ర్ట అధ్యక్షులు శ్రీ చల్లా మధుసూధనరెడ్డి తెలియచేశారు.

Comments