- నారా లోకేష్ ను కలిసిన కార్యకర్తల సంక్షేమం కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్
- కార్యకర్తల సంక్షేమం, గుడివాడ పరిస్థితులపై వివరణ
- పార్టీ బలోపేతం, విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నా
- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్
హైదరాబాద్/ గుడివాడ, జూలై 20 (ప్రజా అమరావతి): విదేశాల నుండి తిరిగి వచ్చిన నారా లోకేష్ ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమం కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ కలిశారు. బుధవారం హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని స్వగృహంలో పూలతో ఎల్ఎన్ (నారా లోహిత్) అక్షరాలు స్పష్టంగా కన్పించేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన బొకేను నారా లోకేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం, రాష్ట్రంలో జరుగుతున్న ఎన్టీఆర్ స్ఫూర్తి - చంద్రన్న భరోసా కార్యక్రమాల నిర్వహణపై శిష్ట్లా లోహిత్ వివరించారు. చంద్రన్న భరోసా కార్యక్రమంలో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి పాల్గొంటున్నానని తెలిపారు. విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలపై స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతోందని చెప్పారు. 2022-24 సంవత్సరాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను వివరించారు. అనంతరం శిష్ట్లా లోహిత్ మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇన్సూరెన్స్ కు సంబంధించి పలు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. దురదృష్టవశాత్తూ మరణించిన కార్యకర్తల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున బీమా మొత్తాన్ని అందించే సౌకర్యం కొనసాగేలా నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. గుడివాడ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను కూడా నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళానని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయాలని ఆదేశించారన్నారు. గుడివాడలో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు స్పష్టం చేశారు. పార్టీ విజయానికి నాయకులంతా కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం జరుగుతుందన్నారు. ఇందు కోసం గుడివాడ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులందరినీ కలుపుకుని వెళ్తానన్నారు. గుడివాడ తెలుగుదేశం పార్టీ సీటును పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని పార్టీ క్రమశిక్షణా సంఘం జాతీయ చైర్మన్ బచ్చుల అర్జునుడు ప్రకటించారని గుర్తుచేశారు. కార్యకర్తలందరూ సైనికుల్లా పనిచేస్తేనే గుడివాడలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం సాధ్యమవుతుందన్నారు. ఇందు కోసం కార్యకర్తల సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు అందరికీ అందేలా చూస్తున్నామన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యానికి సంబంధించి టీడీపీ అధిష్టానం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుందని చెప్పారు. జిల్లాల వారీగా హాస్పిటల్స్, పాఠశాలల్లో రాయితీలపై దృష్టి సారించామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో వైద్యశిబిరాలను నిర్వహిస్తామన్నారు. కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో తీసుకుంటున్న చర్యలను నారా లోకేష్ అభినందించినట్టు చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలను మరింత మెరుగ్గా అందించేందుకు నారా లోకేష్ పలు సూచనలు చేశారన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రస్థాయిలో పార్టీ పటిష్టానికి, కార్యకర్తల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని శిష్ట్లా లోహిత్ హామీ ఇచ్చారు.
addComments
Post a Comment