సి.ఎం.జగన్ అణగారిన వర్గాల పక్షపాతి

 *సి.ఎం.జగన్ అణగారిన వర్గాల పక్షపాతి*                                                                                                                     *ఉప ముఖ్యమంత్రి, ఆబ్కారీ శాఖ మంత్రి  కె.నారాయణ స్వామి*


అమరావతి, జూలై 13 (ప్రజా అమరావతి):  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాల పక్షపాతిగా చరిత్రలో నిలిచిపోతారని ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నారు.  రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని ఎస్.సి.,ఎస్.టి., బి.సి., మైనారిటీలతో పాటు ఇతర వర్గాల వారికి అవసరమైన స్మశాన వాటిక స్థలాలను వెంటనే గుర్తించేందుకు చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలోని  అనేక గ్రామాల్లో ఎస్.సి.,ఎస్.టి.,బి.సి. మైనారిటీలతో పాటు ఇతర వర్గాల వారికి స్మశాన వాటికలు లేక పలు అవస్థలకు గురవుతున్న విషయాన్ని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజుతో కలసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  సానుకూలంగా స్పందిస్తూ పై విధంగా హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో ఆయా వర్గాల వారు అందరూ  ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి  కి జీవితాంతము ఋణపడి ఉంటారంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.

                                                                             

Comments