అమరావతి (ప్రజా అమరావతి);
*గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై క్యాంపు కార్యాలయంలో వర్క్‌షాప్.*
*పాల్గొన్న సీఎం శ్రీ వైయస్.జగన్, ఎమ్మెల్యేలు.*
*గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం మార్గనిర్దేశం.*
*ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారంటే..:*
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యం: సీఎం
జీవితంలో ఏ కార్యక్రమమైనా.. నాణ్యతతో చేస్తేనే నిలదొక్కుకుంటాం
:
అందుకే క్వాలిటీతో కార్యక్రమాలు చేయడం అన్నది ముఖ్యం:
గడపగడపకూ కార్యక్రమాన్ని కూడా నాణ్యతతో చేయండి:
పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకు వచ్చాం:
ప్రజల జీవనప్రమాణాలు పెంచడానికి అనేక చర్యలు తీసుకున్నాం:
అనేక పథకాలను అమలు చేశాం, అభివృద్ధి పనులు చేపట్టాం:
రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలు మనమీద ఆధారపడి ఉన్నాయి:
వారికి న్యాయం జరగాలంటే.. మనం అధికారంలోకి తిరిగి రావాలి:
అధికారంలోకి మామూలుగా రావడంకాదు, మునుపటికన్నా మెరుగైన ఫలితాలతో రావాలి:
కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించాం:
అలాంటప్పుడు మనం అనుకున్న ఫలితాలు ఎందుకు సాధించలేం ?:
రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు పథకాలు అందించాం:
వారి మద్దతు తీసుకుంటే.. 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేం ?
నేను చేయాల్సింది అంతా చేస్తున్నాను :
ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలి :
ఎలాంటి వివక్షలేకుండా, అవినీతికి తావు లేకుండా సంక్షేమ కార్యక్రమాలను అందరికీ అందిస్తున్నాం:
పథకాలకు బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే పంపుతున్నాం:
ప్రతినెలా క్యాలెండర్ ఇచ్చి.. ఎలాంటి పరిస్థితులు ఉన్నా పథకాలకు బటన్ నొక్కుతున్నాం:
ప్రతి ఒక్కరికీ మంచి చేయడాన్ని నా ధర్మంగా.. నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను:
దీనివల్ల ఒక వాతావరణం, ఒక ఫ్లాట్‌ఫాం క్రియేట్ అయ్యింది:
దాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎమ్మెల్యేల బాధ్యత:
ఎమ్మెల్యేలు చేయాల్సింది చేస్తేనే ఫలితాలు సాధిస్తాం:
ఇద్దరూ కలిసికట్టుగా ముందుకు సాగితేనే మంచి ఫలితాలు సాధించగలుగుతాం:
అలాంటి పరిస్థితి మనకళ్లముందు కనిపిస్తున్నప్పుడు మనం అడుగులు ముందుకేయాలి:
గతంలో కన్నా.. మెరుగ్గా ఫలితాలు సాధించాలి:
ఒక్కో సచివాలయంలో ప్రాధాన్యతా పనులకు రూ.20 లక్షలు కేటాయింపు: సీఎం
గడపగడపకూ వెళ్లినప్పుడు ప్రజలనుంచి వినతులను పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యతా పనులకోసం ఈ డబ్బు ఖర్చు:సీఎం
ఒక నెలలో ఎమ్మెల్యేలు తిరిగే సచివాలయాల్లో పనులకు సంబం«ధించి ముందుగానే కలెక్టర్లకు డబ్బు ఇవ్వనున్నాం:
తర్వాత వెంటనే పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ :
ఎమ్మెల్యేలకు రూ.2 కోట్లు చొప్పున కేటాయిస్తూ గతంలో ఇచ్చిన ఆదేశాలమేరకు ఇవాళ జీవో కూడా ఇచ్చాం:
ముఖ్యమంత్రి అభివృద్ధి నిధి (సీఎండీఎఫ్) నుంచి ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద కేటాయింపు.
సచివాలయాలకు కేటాయించే నిధులకు ఇది అదనం:
ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు కేటాయించి పనులు చేయించే ఛాలెంజ్‌ను నేను తీసుకున్నాను:
ఇక మీరు చేయాల్సిందల్లా గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడమే:
గడప, గడపకూ కార్యక్రమంలో భాగంగా రానున్న నెలరోజుల్లో 7 సచివాలయాలను ఎమ్మెల్యేలు సందర్శించాలి:
వచ్చే నెలరోజుల్లో కనీసంగా 16 రోజులు– గరిష్టంగా 21రోజులు గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి :
కమిట్‌మెంట్‌తో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి :
గడప,గడపకూ కార్యక్రమాన్ని మానిటర్ చేయాలన్న సీఎం
ఇందు కోసం 175 నియోజకవర్గాలకు అబ్జర్వర్లను నియమించాలని సీఎం ఆదేశం.
addComments
Post a Comment