ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని, ఓటర్ ఆధార్ అనుసంధానం కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాల

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని, ఓటర్ ఆధార్ అనుసంధానం కార్యక్రమాన్ని   పటిష్టంగా నిర్వహించాల


ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ లకు సూచించారు.


గురువారం విజయవాడ ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుండి  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ  ముఖేష్ కుమార్ మీనా, అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   నిర్వహించి ఓటరు జాబితా, ఎలక్షన్ పిటిషన్స్, సాంకేతిక సమస్యలు ఉన్న ఓటింగ్ యంత్రాలు తదితర అంశాలపై సమీక్షించారు.  ఓటర్ల జాబితాలో సవరణలు సవరించిన ఎన్నికల దరఖాస్తు ఫారాలను గురించి 2023 సంవత్సరానికి సంబంధించి ముందు చేపట్టవలసిన ప్రీరివిజన్ కార్యక్రమాలను గురించి, ఓటర్ ఆధార్ అనుసంధానం గురించి, ఎవరైతే ఓటర్ కార్డు ఇస్తున్నారో వారి దగ్గర ప్రమాణీకరణ కోసం 6-B ఫారం పొంది జాగ్రత్తగా పరిశీలించి ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ లు తీసుకోవలసిన  చర్యలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పలు సూచనలు చేశారు.


జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ, ఓటరు జాబితాలో నమోదు నిమిత్తం వచ్చిన అభ్యర్థనలు మరియు అభ్యంతరాలు క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా ఓటరు జాబితా తయారు చేయడం జరుగుతోందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను అనుసరించి 18 సంవత్సరాలు పూర్తయిన వారందరినీ ఓటరు జాబితాలో నమోదు చేసే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందన్నారు. ఇందుకు బిఎల్ఓ లు పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును నమోదు చేసుకునే విధంగా చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలోని బిఎల్ఓల నియామకాలకు సంబంధించిన పలు అంశాల గురించి  రాష్ట్ర ఎన్నికల అధికారికి జిల్లా కలెక్టర్ వివరించారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్.కూర్మనాధ్,  నెల్లూరు, కందుకూరు, కావలి ఆర్.డి.ఓ లు శ్రీ కొండయ్య, శ్రీ జి.వి సుబ్బారెడ్డి, శ్రీ శీనానాయక్, జడ్పి సి.ఈ.ఓ శ్రీమతి వాణి, డి.ఆర్.డి.ఎ, డ్వామా పిడి లు శ్రీ సాంబశివా రెడ్డి, శ్రీ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు


Comments