వరదల్లో అధికార యంత్రాగం ముందుస్తు చర్యలతో ప్రాణనష్టం లేకుండా నివారించగలిగాం
• 26లక్షల క్యూసెక్కుల వరద జూలైనెలలో రావడం ఎన్నడూ చూడలేదు
• 5జిల్లాల్లో 191 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షా 30వేల మందిని తరలించాం
• తక్షణ సహాయ చర్యలకై వరద జిల్లాల్లో జిల్లా కలక్టరుకు 5కోట్ల రూ.లు ఇచ్చాం
• పునరావాస కేంద్రాల నుండి తిరిగి ఇంటికివెళ్ళే వారికి కుటుంబానికి 2వేల రూ.లు
• పునరావాస కేంద్రాల్లో లేనివారికి కుటుంబానికి 25కిలోల బియ్యం,కిలో కందిపప్పు, కిలో ఉల్లిపాయలు,కిలో బంగాళా దుంపలు,పాలు బిస్కెట్స్ వంటివి పంపిణి
రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,బిసి సంక్షేమ మంత్రి సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ
అమరావతి,18 జూలై (ప్రజా అమరావతి):రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం సకాలంలో అవసరమైన అన్నిముందుస్తు చర్యలు తీసుకోవడంతో గోదావరి వరదల్లో ప్రాణ నష్టం లేకుండా చూడ గలిగామని రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు,బిసి సంక్షేమం,సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు సిహెచ్.శ్రీనివాస వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు. సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు పబ్లిసిటీ సెల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూలై మాసంలో గోదావరి నదిలో భద్రాచలం వద్ద 70.9 అడుగులు,ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 26 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించడం ఇటీవల చరిత్రలో ఇదే ప్రధమమని పేర్కొన్నారు.వరదలు,తుఫానులు వంటి విపత్తులను గతంలో ఒక జిల్లా కలక్టరు,ఎస్పి చూడాల్సి వచ్చేదని కాని నేడు కొత్త జిల్లాల ఏర్పాటుతో ముగ్గురు కలక్టర్లు, ముగ్గురు ఎస్పిలు పర్యవేక్షణలో సహాయ చర్యలు చేపట్టడంతో ప్రజలకు మరిన్ని సహాయ చర్యలు అందాయని చెప్పారు.గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు,తూర్పు గోదావరి, ఏలూరు,పశ్చిమ గోదావరి,కోనసీమ జిల్లాలు అత్యధికంగా ప్రభావితం అయ్యాయని తెలిపారు. ఆయా జిల్లాల మంత్రులు,జిల్లా ఇన్చార్జి మంత్రులు,ఎంఎల్ఏలు,కలక్టర్లు,ప్రత్యేక అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు,గ్రామ సర్పంచ్ ల వరకూ అంతా నిరంతరం రేయింబవళ్ళు ఫీల్డులోనే ఉండి ప్రజలకు సేవలందించారని మంత్రి పేర్కొన్నారు.అన్నిటికంటే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయాలు,వాలంటీర్ల వ్యవస్థల ద్వారా లంక,లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేసి వారిని సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం లేకుండా కాపాడగలిగామని మంత్రి వేణుగోపాల కృష్ణ స్పష్టం చేశారు.
వరద ప్రభావిత జిల్లాల్లో తక్షణ సహాయక చర్యల నిమిత్తం ప్రతి కలక్టరుకు 5కోట్ల రూ.లు వంతును నిధులు విడుదల చేయడం జరిగిందని మంత్రి వేణుగోపాల కృష్ణ చెప్పారు. వరద ప్రభావానికి లోనైన 5 జిల్లాల్లో 191 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి లక్షా 30వేల 574 మందిని వాటిలోకి తరలించి వారికి అవసరమైన తాగునీరు,ఆహారం వంటి కనీస అవసరాలను కల్పించడం జరుగుతోందన్నారు.256 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడం తోపాటు వదర ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబల కుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.పునరావాస కేంద్రాలల్లోని వారికి కోటి 64 లక్షల ఆహార పొట్లాలను సిద్దం చేసి పంపిణీ చేశామని అన్నారు.అదే విధంగా 14 లక్షల మంచినీటి ఫ్యాకెట్లను అందించామని వివరించారు.ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో పాటు 10 ఎన్డిఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని తెలిపారు.అల్లూరి సీతారామ రాజు జిల్లా చింతూరు ప్రాంతంలోని బాధితులకై 10వేల ఆహార పొట్లాలను అందించడంతో పాటు రాజమహేంద్రవరం నుండి మరో 10 వేల ఆహార పొట్లాలను కూడా పంపిస్తున్నట్టు మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ వివరించారు.
పునరావాస కేంద్రాల నుండి ఇంటికి తిరిగివెళ్ళే వారికి కుటుంబానికి 2వేల రూ.లు వంతున ఆర్ధిక సహాయాన్ని అందించండ జరుగుతోందని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. అదే విధంగా వదర ప్రభావానికి లోనై పునరావాస కేంద్రాల్లో లేని కుటుంబాల వారికి కుటుంబానికి 25కిలోల బియ్యం,కిలో కందిప్పు,కిలో ఉల్లిపాయలు,కిలో బంగాళా దుంపలు, కిలో ఆయిల్ తోపాటు పాలు వంటి సరుకులను ఉచితంగా అందించడం జరుగుతోందని మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మీడియాకు వివరించారు.
ఇంత పెద్దఎత్తున వరదప్రవాహం వచ్చినా గోదావరి ఏటిగట్లకు గండ్లు పడకుండా నివారంచ గలిగామంటే అందుకు దివంగత ముఖ్యమంత్రి డా.వైయస్.రాజశేఖర్ రెడ్డి కాలంలో ఏటిగట్లను పటిష్టం చేయడమే కారణమని సమాచార శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ గుర్తు చేశారు.కోనసీమ ప్రాంతంలో 31చోట్ల ఏటిగట్లు బలహీనంగా ఉండి గండ్లు పడే అవకాశం ఉన్న చోట్ల ఇసుకబస్తాలు వేసి గండ్లు పడకుండా కాపాడామని ఆయన పేర్కొన్నారు.
వదర ప్రభావానికి గురైన ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు అందరు ప్రజా ప్రతినిధులు,అధికార యంత్రాంగం అంతా అహర్నిశలు శ్రమిస్తుంటే ఆవాస్తవాలను కప్పి పుచ్చి కేవలం రాజకీయ లబ్దికోసం ప్రతిపక్షనేతలు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడం సరికాదని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పారు.ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి హెలీకాప్టర్లో వెళ్ళి ఏరియల్ సర్వే చేస్తే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రతిపక్షనేత విమర్శించారని వారి హయాంలో ఎలా వెళ్ళారని మంత్రి వేణుగోపాల కృష్ణ ప్రశ్నించారు.వారి హయాలంలో నిత్యం కరువు పరిస్థితులే నెలకొన్నాయని గుర్తు చేశారు.ప్రతిపక్షం అంటే ఆపదలో ఉన్న వారికి ఓదార్పు నివ్వాలని ప్రభుత్వం అందించే సహాయ చర్యల్లో ఏమైనా లోపాలున్నాఎవరికైనా సహాయ చర్యలు అందకున్నా అలాంటి విషయాలను ప్రభుత్వం దృష్టికి తేవాలి తప్ప లేనిపోని ఆరోపణలు చేయడం సబబు కాదని మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ ప్రతిపక్షనేతలకు హితవు చేశారు.
addComments
Post a Comment