గత ప్రభుత్వాలు కాపులను ఉద్దరిస్తామని ఎన్నో రకాల మాటలు చెప్పాయి, కానీ చేతలు శూన్యం


గొల్లప్రోలు, కాకినాడ జిల్లా (ప్రజా అమరావతి);


*వరసగా మూడో ఏడాది వైఎస్సార్‌ కాపు నేస్తం*


*కాకినాడ జిల్లా గొల్లప్రోలులో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా), రహదారులు, భవనాల శాఖ మంత్రి*


అందరికీ నమస్కారం, గత ప్రభుత్వాలు కాపులను ఉద్దరిస్తామని ఎన్నో రకాల మాటలు చెప్పాయి, కానీ చేతలు శూన్యం


. ఈ రోజు జగనన్న కాపు కార్పొరేషన్‌ ద్వారా ఏడాదికి రూ. 10 వేల కోట్లు ఇస్తామన్నదానికంటే మిన్నగా ఈ మూడేళ్ళలో సుమారు రూ. 33 వేల కోట్లు మన కాపుల కోసం ఇచ్చారు. గతంలో చంద్రబాబు హయాంలో తుని ఘటన, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది కాపులపై కేసులు పెట్టి రాక్షసత్వంతో వ్యవహరించారు. కానీ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబునాయుడు పెట్టిన కేసులు తీసేసిన దేవుడు జగనన్న అనడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. కాపు యువతకు ఒక మాట చెబుతున్నాను, పవన్‌కళ్యాణ్‌ను నమ్మి ఆయన వెనకాల తిరుగుతున్న వారికి...ఆయన్ను నాయకుడు చేయాలని మీరంతా తిరుగుతుంటే ఆయన మాత్రం చంద్రబాబును నాయకుడిని చేసి మనల్ని మోసం చేయాలని తిరుగుతున్నాడు. ఆ మోసపు మాటలు నమ్మెద్దు. 2019లో చంద్రబాబు, ఎల్లో మీడియా, పవన్‌కళ్యాణ్‌ ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని అడ్డదారులు తొక్కినా మనం జగనన్నను ఏ విధంగా నిలబెట్టుకున్నామో, కాపు అక్కచెల్లెమ్మలంతా తగ్గేదేలే అంటూ జగనన్నతో మమేకమై ప్రతీ గడప గడపలో కూడా జగనన్నను మళ్ళీ సీఎంగా చేసుకోవడానికి సిద్దంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.


*బండారు సుజాత, కాపు నేస్తం లబ్ధిదారు, కాకినాడ*


నమస్తే అన్నా, నేను రెండు సార్లు కాపునేస్తం అందుకున్నాను, ఇప్పుడు మూడో విడత అందుకుంటున్నాను. నేను హౌస్‌ వైఫ్‌ను, ఇంట్లోనే ఉండేదానిని, కాపు నేస్తం ద్వారా వచ్చిన డబ్బుకి, కొంత నా సొంత డబ్బు కలిపి సొంతకాళ్ళపై నిలబడాలని చిన్న టీ కొట్టు పెట్టుకున్నాను, రెండోసారి వచ్చిన డబ్బును కూడా షాప్‌లో వాడుకున్నాను. మీరు పాదయాత్రలో ఇచ్చిన హామీలు అన్నీ అమలుచేస్తున్నారు. గత ప్రభుత్వం ఏం చేసిందండీ, చంద్రబాబు హయాంలో ఏ పథకాలు మాకు అందలేదు, మా కాపులను గుర్తించలేదు, మా కాపులను ఎన్నో హింసలు పెట్టారు, బూటు కాళ్ళతో తన్నించారు, లాఠీ చార్జ్‌ చేయించారు, మా ఆడవారిని అసభ్యంగా మాట్లాడారు. మీరు సీఎం అయిన తర్వాత మా కాపుల్లో కూడా లేనివారు ఉన్నారని గుర్తించి మాకు కాపునేస్తం పథకం ద్వారా సాయం చేస్తున్నారు. నా భర్త ఫించన్‌ తీసుకుంటున్నాడు, మీరు ఇస్తున్న ఫించన్‌ డబ్బులతో నెలనెలా మందులు వాడుతున్నాడు, చాలామందికి చాలా రకాలుగా సాయం చేస్తున్నారు, ఏ ముఖ్యమంత్రి ఇలా చేయలేదు, మీరే మళ్ళీ మళ్ళీ సీఎంగా రావాలని కోరుకుంటున్నాను. నా భర్తకు కళ్ళు కనిపించకపోతే మీరు కంటి వెలుగు పథకం ద్వారా కంటి ఆపరేషన్‌ చేయించారు, నాకు సొంత ఇళ్ళు లేదు, కలలో కూడా ఊహించలేదు, మీరు వచ్చిన తర్వాత నాకు రూ. 6 లక్షల విలువైన ఇల్లు ఇచ్చారు. ఒక అవ్వాతాతలకు మనవడిగా, ఒక ఇంటికి కొడుకుగా, ఒక ఇంటికి తమ్ముడిగా చాలా చేస్తున్నారు. మా కాపులను గుర్తించిన నాయకుడు మీరే, మా కాపులంతా మీకు అండగా ఉంటాం. నా ఇంటి పెద్ద కొడుకుగా మీరు సాయం చేశారు, నేను కట్టుకున్న సొంతింటి గృహప్రవేశానికి మీరు రావాలి. కాపులకు అండగా ఉంటానంటూ వచ్చిన వ్యక్తి అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. మీరు మాత్రమే మమ్మల్ని కాపాడుతున్నారు, ధన్యవాదాలు.


*చిత్తాల రాణి, కాపు నేస్తం లబ్ధిదారు, కాకినాడ రూరల్‌*


అన్నా నమస్కారం, గత ప్రభుత్వం ఎన్నడూ కూడా మా కాపులను గుర్తించలేదు, కాపులంటే అగ్రవర్ణాలు వారికి ఏం చేయక్కర్లేదు అనుకున్నారు, కానీ మీరు వచ్చిన తర్వాత కాపు మహిళలకు అండగా నిలబడ్డారు. మీరు ఇచ్చిన కాపునేస్తం ద్వారా నేను గేదెను కొనుక్కుని పాలవ్యాపారం చేసుకుంటున్నాను, నా భర్తకి నెలకు రూ. 4 వేలు ఇచ్చి నేను చేదోడువాదోడుగా నిలుస్తున్నాను. అలాగే నా భర్త ఆటోడ్రైవర్, తనకు వాహనమిత్ర ద్వారా ఏడాదికి రూ. 10 వేలు అందుతున్నాయి, ఆ డబ్బుతో మేం రిపేర్లు చేయించుకుంటున్నాం, మా జగనన్న డబ్బు ఇస్తున్నాడు నువ్వు కంగారుపడకు అని నేను నా భర్తకు చెబుతున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను, నా బిడ్డకు ఏడాదికి రూ. 30 వేలు ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ వస్తుంది, నా బిడ్డకు విద్యాదానం చేసింది మీరే, మా అత్తగారికి పొద్దున్నే తలుపుకొట్టి మరీ ఫించన్‌ ఇస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు, నా భర్తకు హర్ట్‌ఎటాక్‌ వస్తే ఆసుపత్రిలో రూ. 1.50 లక్షలు అవుతుందంటే మీరు ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు చూపిస్తే దానివల్ల నా భర్త రెండు స్టంట్‌లు వేయించుకుని తిరిగి వచ్చారు. నా భర్తకు మీరు ప్రాణభిక్ష పెట్టారు. నేను డ్వాక్రా మహిళను, నాకు సున్నావడ్డీలు, వైఎస్‌ఆర్‌ ఆసరా వచ్చింది, మీరు పెట్టిన పథకాలన్నింటి ద్వారా నేను రూ 1.97 లక్షలు తీసుకున్నాను. నాకు సొంతింటి కల నెరవేరింది, నేను అద్దె ఇంట్లోనే ఉంటానేమో అనుకున్నా, కానీ మీ ప్రభత్వం వచ్చిన తర్వాత నాకు రూ. 5 లక్షల విలువ చేసే ఇంటి స్ధలం వచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మా కాపు ఆడపడుచుల అందరి తరపునా మీకు కృతజ్ఞతలు, మా బావగారు చనిపోతే వైఎస్‌ఆర్‌ బీమా వచ్చింది, మీరు చెప్పినవన్నీ చేస్తున్నారు, మేం ఇంత సంతోషంగా ఉన్నామంటే మీరే కారణం, మీరు పదికాలాలపాటు చల్లగా ఉండాలన్నా, ఎప్పటికీ మీరే సీఎం...ధన్యవాదాలు.

Comments