ఆయుర్వేద వైద్య విధానం పై అవగాహన సదస్సు

 ఆయుర్వేద వైద్య విధానం పై అవగాహన సదస్సుబెల్లంకొండ, జూలై 27 (ప్రజా అమరావతి) :   పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలంలోని నాగిరెడ్డి పాలెం యానాద్రి కాలనీ లో  బుధవారం ఆయుర్వేద వైద్య విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎం పి పీ  ఎస్టి స్కూల్ నందు  డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ వైద్యాధికారి ఆధ్వర్యంలో,గౌరవనీయులైన ఆయుష్ కమిషనర్ శ్రీ రాములు గారు, ప్రాంతీయ ఉపసంచాలకులు శ్రీమతి పద్మజాతి గార్ల ఆదేశానుసారము ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆయుష్ గ్రామము కార్యక్రమములో భాగంగా 1. ఆయుర్వేద వైద్య విధానం పైన అవగాహన కార్యక్రమం  2,రెండు.  ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం, 3మూడు. ఔషధ మొక్కల పెంపకం వాటి ఉపయోగాలు, 4నాలుగు.  గృహ  వైద్యం వంటింట్లో దినుసుల ఔషధాలు ప్రాముఖ్యత గురించి తెలియపరచడం   5, ఐదు. పేరట్లో ఔషధ మొక్కల గురించి తెలియపరచడం,6 ఆరు .   దీర్ఘకాల వ్యాధుల పైన అవగాహన, 7.ఏడు. సీజనల్ ని బట్టి ఆహారము విహారము వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి గురుంచి తెలియపరచడం.సీజన్లో వచ్చే వ్యాధుల పైన ఆరోగ్యం పైన అవగాహన సదస్సు మరియు వైద్య శిబిరం నిర్వహించడం కల జరిగింది. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల  జలుబు దగ్గు జ్వరాలు కడుపునొప్పి వాంతులు విరేచనాలు మొదలగు వ్యాధులు వస్తాయని వాటి నివారణ గురించి తెలియపరిచి, కాచి వడపోసిన నీటిని మాత్రమే త్రాగవలెను దోమ కాటు వలన వచ్చే వ్యాధులు మలేరియా ఫైలేరియా డెంగ్యూ చికెన్ గన్య  , స్వైన్ ఫ్లూ మొదలగు వ్యాధులు వస్తాయని దోమతెరలు వాడవలెనని, ఆహారంలో తృణధాన్యాలు ఎక్కువ తీసుకోవాలని మరియు సీజన్లో దొరికే పండ్లు తప్పకుండా తీసుకొని తెలియపరిచారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించడం వలన   కొన్ని వ్యాధులు రాకుండా కాపాడుకో వచ్చును  అని తెలియపరిచారు. గ్రామస్తులకు విద్యార్థినీ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఆయుష్ మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శివపార్వతి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు


Comments