అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పధకాలు అందాలని తాపత్రయపడే ప్రభుత్వం తమది

 

నెల్లూరు జూలై 22 (ప్రజా అమరావతి);


అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పధకాలు  అందాలని తాపత్రయపడే ప్రభుత్వం తమద




ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. 

శుక్రవారం సాయంత్రం పోదలకూరు మండల కేంద్రంలో sbi వారి ఆర్ధిక సహకారంతో మహిళా స్వయం సంఘాలకు ఆస్తుల పంపిణీ కార్యక్రమం లో మంత్రి పాల్గోన్నారు. తొలుత పోదలకూరు మండల కేంద్రంలో అడుగు పెట్టిన మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి కి మహిళలు అపూర్వ స్వాగతం పలికారు. 

ఈ సంధర్బంగా జరిగిన సమావేశంలో sbi డి జి యం వరదరాజన్ కార్యక్రమ ముఖ్యోద్దేశంను వివరిస్తూ, రైతుల సమస్యలను స్వయంగా తలుసుకోగోరే ప్రయత్నంలో భాగంగా sbi దేశ వ్యాప్తంగా ఈ రోజు ఓ గ్రామం లో రాత్రి బస చేసి వారి సాధక భాదలను ప్రత్యక్షంగా చూసి, అవసరమైన రుణాలను విరివిగా అందించుటకు ప్రయత్నిస్తామని చేప్పారు. అందులో భాగంగా చెన్నారెడ్డిపల్లి గ్రామం లో బస చేస్తామన్నారు. 


ఈ సంధర్బంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉన్నతమైన ఆశయంతో సామాజిక భాద్యతగా sbi బ్యాంకు చేపట్టిన రాత్రి బస వినూత్నమైన కార్యక్రమమన్నారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని పారిశ్రామికవేత్తలున్నారని, కానీ రుణం చెల్లించని ఒక్క స్వయం సహాయక గ్రూపు కూడా ఉండదని  కితాబునిచ్చారు. మహిళల మీద విశ్వాసంతో లింకేజి రుణం 5 లక్షల నుండి 20లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు. అదేవిధంగా పొదలకూరు మండలాన్ని నుడా పరిధిలో చేర్చి నందన ఇల్లు లేని నిరుపేదలoదరికీ త్వరలోనే సొంతింటి కల సాకారం చేస్తామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ విధానాలు దేశానికే ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా పొదలకూరు, రాపూరు, కలువాయి, మనుబోలు మండలాలకు చెందిన స్వయం సహాయక గ్రూపులకు చెందిన 15 కోట్ల మెగా చెక్కును వారికి అందజేశారు. రాబోయే రోజుల్లో రైతులకు, మహిళలకు అండగా నిలిచి వారి ఆర్ధికాభివృద్ధికి తోడ్పడాలని బ్యాంకు అధికారులను మంత్రి కోరారు. 


ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుబ్బారాయుడు, పీఏసీఎస్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, డి ఆర్ డి ఎ పి డి సాంబశివ రెడ్డి ,జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, sbi రీజనల్ మేనేజర్ అరుణ్ కుమార్ చీఫ్ మేనేజర్ రాజు ఎంపీడీవో నగేష్ కుమారి ఎమ్మార్వో శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Comments