మొదటి సారిగా గిరిజన మహిళ దేశ రాష్ట్రపతి అవుతున్నారు.


అమరావతి (ప్రజా అమరావతి);


*రాష్ట్రానికి ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి శ్రీమతి ద్రౌపతి ముర్ము.*


*వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్ధిత్వానికి మద్ధతు తెలియజేసిన నేపధ్యంలో రాష్ట్రానికి వచ్చిన శ్రీమతి ద్రౌపతి ముర్ము.*


*వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను శ్రీమతి ద్రౌపతి ముర్ముకి పరిచయం చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*



*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...*


175 స్థానాల్లో 151 సీట్లలో గెలిచిన ఎమ్మెల్యేలు, 

25 మంది ఎంపీ స్థానాల్లో 22 చోట్ల గెలిచిన ఎంపీలు,

పార్టీ తరఫున ఉన్న 9 మంది రాజ్యసభ సభ్యులు

ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. 

ద్రౌపది ముర్ముగారిని మనం అంతా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది.

మొట్టమొదటిగా గిరిజన మహిళ ఈ దేశ రాష్ట్రపతిగా ఎన్నుకోబడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదు. మొదటి సారిగా గిరిజన మహిళ దేశ రాష్ట్రపతి అవుతున్నారు. 



మన పార్టీ మొదటి రోజు నుంచి ఏ రకంగా సామాజిక న్యాయంవైపున ఉంటుందో అందరికీ తెలుసు. 

సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం మనది. 

అందులో భాగంగానే మరో అడుగు ముందుకు వేస్తూ ఇవాళ ద్రౌపది ముర్ముగారిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉంది. 

పార్టీ నిర్ణయాన్ని సహృదయంతో బలపరచాలని కోరుతున్నాను. 

18న జరిగే ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవ్వరూ మిస్‌ కాకుండా ఓటు వేయాలి. అందరూ వచ్చి ఓటువేసేలా విప్‌లంతా ఈ బాధ్యత తీసుకోవాలి:

18వ తారీఖున ఉదయాన మాక్‌ పోలింగ్‌లో పాల్గొని ఆతర్వాత ఓటింగ్‌కు వెళ్లాలి.

దీనివల్ల ఓటింగ్‌లో తప్పులు జరక్కుండా నివారించగలుగుతాం.

పొరపాటు జరిగితే ఓటు చెల్లకుండా పోతుంది. 

వేసిన ప్రతి ఓటు చెల్లుబాటు అయ్యేలా చూసుకోవాలి.

జాగ్రత్తలు తీసుకుని ఓటు వేస్తే అన్నీ చెల్లుబాటు అవుతాయి.

ఎంపీల వైపు నుంచి సాయిరెడ్డి, మిథున్‌ రెడ్డి పూర్తి బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే వైపు నుంచి విప్‌లు, మంత్రులు అందరూ వచ్చేలా చూసుకోవాలి.

మంత్రులందరూ వారి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరూ మిస్‌ కాకుండా ప్రతిఒక్కరూ కూడా హాజరయ్యేలా బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 

ఎవ్వరు మిస్‌ అయినాకూడా ఒక ఓటు మనమంతట మనమే తగ్గించిన వారం అవుతాం. 

ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడుతున్నప్పుడు మన వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

Comments