భారతదేశ సామాజిక న్యాయానికి కట్టుబడాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం


అమరావతి (ప్రజా అమరావతి);


*రాష్ట్రానికి ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి శ్రీమతి ద్రౌపతి ముర్ము.*


*వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్ధిత్వానికి మద్ధతు తెలియజేసిన నేపధ్యంలో రాష్ట్రానికి వచ్చిన శ్రీమతి ద్రౌపతి ముర్ము.**ఈ సందర్భంగా శాసనసభాపతి శ్రీ తమ్మినేని సీతారామ్‌ మాట్లాడుతూ... ఏమన్నారంటే.*


వేదికను అలంకరించిన సీఎం శ్రీ జగన్మోహన్‌రెడ్డి గారికి, భారత రాష్ట్రపతి అభ్యర్ధిగా నామినేషన్‌ దాఖలు చేసిన మన మద్ధతు కోసం వచ్చిన శ్రీమతి ద్రౌపతి ముర్ముగారికి వేదికపై ఆశీనులైన పెద్దలందరికీ అభివందనాలు.


ఈ రోజు ఇదో అద్భుతమైన ఘటన. భారతదేశ చరిత్రలో ఒక గిరిజన మహిళా అభ్యర్ధికి రాష్ట్రపతిగా అవకాశాన్ని కల్పించిన ప్రయత్నంలో.. మన రాష్ట్రం నుంచి సామాజిక న్యాయం కోసం ఒక ఉద్యమంలా ముందుకు దూసుకుపోతున్న ముఖ్యమంత్రిగారు, వారికి సహాయాన్ని మనందరం చేయాలి, భారతదేశ సామాజిక న్యాయానికి కట్టుబడాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయం


.  దీన్ని మనందరం స్వాగతించాం. ముఖ్యంగా ఎందరో మహానుభావులు, త్యాగధనులు భారతదేశ స్వాతంత్య్ర పోరాటం కోసం అసువులు బాసిన అమరవీరుల ఆశయాలు ఇప్పుడిప్పుడే పురుడుపోసుకుని, రూపుదిద్దుకుంటున్నాయి. ఆ ప్రక్రియలోనే ఒకనాటి రాష్ట్రపతి కలాంగారు, ఇప్పటి రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌గారైనా, ఈరోజు పోటీలో ఉన్న శ్రీమతి ద్రౌపతి ముర్ముగారు. 

 కచ్చితంగా ఇది మంచి సామాజిక విప్లవానికి దారితీస్తుంది. ఆ ప్రయత్నంలో భారతదేశంలో ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి గారు రోల్‌మోడల్‌గా నిలుస్తారు. దామాషా పద్ధతిలో రాజ్యాధికారంలో కానీ, మహిళా రిజర్వేషన్లలో కానీ, సామాజిక న్యాయం ముందుకు తీసుకువెళ్తున్న ప్రయత్నంలో మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ అభ్యర్ధిత్వాన్ని  మనస్ఫూర్తిగా మాట ఇచ్చి, సమర్ధిస్తున్న తీరుకు మనందరం ముగ్దులమయ్యాం. ప్రతి ఒక్కరం ఇదొక చారిత్రక బాధ్యతగా భావించి ఈ కార్యక్రమాన్ని మనందరం 18 వ తేదీన విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.

Comments