*" విద్యార్థులు ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ."*
*- గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ .*
పెడన (ప్రజా అమరావతి);
విద్యార్థుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ, మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ జోగి రమేష్ గారు ఒక ప్రకటనలో కొనియాడారు.
నేటి నుంచి పెడన నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలు మరియు పెడన మున్సిపాలిటీ పరిధిలోని 149 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 27 మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు మరియు 35 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఏ.ఎన్.ఎంల సందర్శించి విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య వివరాలు యాప్‌లో నమోదు చేయనున్న నేపథ్యంలో మంత్రి శ్రీ జోగి రమేష్ గారు ఈ ప్రకటన విడుదల చేస్తూ మరిన్ని వివరాలు వెల్లడించారు.
15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా స్కూల్ హెల్త్ డ్రైవ్ కార్యక్రమం జరగనుందని, ఇందులో భాగంగా విద్యార్థులు, పాఠశాల పరిసరాల పరిస్థితిపై వివరాల సేకరించి వారిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీ జోగి రమేష్ గారు వివరించారు.
సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఏ.ఎన్.ఎంలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను సందర్శించి విద్యార్థులను స్క్రీనింగ్ చేసి విద్యార్థుల ఎత్తు, బరువు, బాడీమాస్ ఇండెక్స్ వివరాలు సేకరించడంతో పాటు, రక్తహీనత గుర్తించేందుకు హిమోగ్లోబిన్ పరీక్షలు చేపడతారని మంత్రి శ్రీ జోగి రమేష్ గారు వివరిస్తూ బడిపిల్లల బంగారు భవిష్యత్తుకై ఇలాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
addComments
Post a Comment