ది.11-07-2022 శాకంబరీ ఉత్సవములు ప్రారంభం:
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు అనగా ది.11-07-2022 ఆషాఢ శుద్ధ త్రయోదశి , సోమవారము నుండి ది.13-07-2022 ఆషాఢ పౌర్ణమి, బుధ వారము వరకు దేవస్థానం నందు వైభవంగా నిర్వహించు శ్రీ అమ్మవారి శాకాంబరీ దేవి ఉత్సవములు శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారి సమక్షంలో
ఆలయ స్థానాచార్యుల వారు మరియు వైదిక కమిటీ సభ్యుల వారి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు శ్రీ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, శాకంబరీ దేవి ఉత్సవములును ప్రారంభించారు.
పై మూడు రోజులపాటు శ్రీ శాకంబరీ దేవి రూపంలో దర్శనమివ్వనున్న శ్రీ కనకదుర్గమ్మ వారు..
- శాకంబరీ దేవి ఉత్సవములు మొదటి రోజు సందర్భంగా ఆకుకూరలు మరియు కూరగాయలుతో అలంకరించిన దేవస్థానం ప్రాంగణములు, శ్రీ అమ్మవారు, ఉపాలయములలోని దేవతామూర్తులు, మరియు ఉత్సవ మూర్తులు..
ఈరోజు కార్యక్రమం వివరములు:
- ఉ.గం.07.30 లకు విఘ్నేశ్వర పూజ, ఋత్విక్ వరుణ,
పుణ్యాహ వచనము, అఖండ దీపారాధన,అంకురార్పణ.
- సా.గం.04-00లకు కలశస్థాపన,అగ్నిప్రతిష్టాపన,మండపారాధన
హారతి, మంత్రపుష్పము, ప్రసాద వితరణ.
- శాకంబరీ ఉత్సవముల సందర్భంగా 3 రోజుల పాటు దేవస్థానం నందు వివిధ శాఖములతో(ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు) తయారుచేసిన కదంబంను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయబడును..
addComments
Post a Comment