నెల్లూరు, జూలై 4 (ప్రజా అమరావతి): ఒకరోజు జిల్లా పర్యటనకు విచ్చేసిన కేంద్ర అణుశక్తి మంత్రిత్వ శాఖ డైరెక్టర్, జల శక్తి అభియాన్ నోడల్ అధికారి
ఇ. రవిందరన్, జలశక్తి అభియాన్ శాస్త్రవేత్త శ్రీ రూపేష్ కుమార్ తమ పర్యటన పూర్తిచేసుకొని సోమవారం సాయంత్రం పంచాయతీ రాజ్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా వీరు అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లాలో నీటి వనరుల స్థితిగతులను, అభివృద్ధికి చేపడుతున్న చర్యలను డ్వామా పిడి శ్రీ తిరుపతయ్య, జడ్పీ సీఈవో శ్రీమతి వాణి వివరించారు.
addComments
Post a Comment