రామాయపట్నం ఓడరేవు భూమిపూజ కార్యక్రమానికి విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు

 

నెల్లూరు, జులై 18 (ప్రజా అమరావతి): రామాయపట్నం ఓడరేవు భూమిపూజ కార్యక్రమానికి విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు అన్ని ఏర్పాట్లు


పకడ్బందీగా చేపట్టిన్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 20వ తేదీన జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు భూమిపూజకు  విచ్చేస్తున్న సందర్భంగా సోమవారం సాయంత్రం మొండివారిపాళెంలో హెలీప్యాడ్, శిలాఫలకం, బహిరంగ సభ  ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ కేవిఎన్ చక్రధర్ బాబు  జిల్లా ఎస్పీ శ్రీ సిహెచ్ విజయ రావు,  కందుకూరు ఎమ్మెల్యే శ్రీ మహీధర్ రెడ్డితో కలిసి పరిశీలించారు. 


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 20వ తేదీన ఉదయ రామాయపట్నం ఓడరేవుకు భూమి పూజ చేసిన అనంతరం ప్రజలనుద్దేశించి బహిరంగ సభలో ప్రసంగిస్తారన్నారు. ఈ సభలోనే పోర్టు ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు పునరావాసం కింద పట్టాలు అందజేస్తారన్నారు. సీఎం పర్యటనకు ఎక్కడా లోటుపాట్లు లేకుండా భద్రత, సభ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అలాగే పోర్టు నిర్మాణ పనులను శరవేగంగా చేపట్టేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నట్లు చెప్పారు. తద్వారా ఈ ప్రాంతంలో ఓడరేవు ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఆస్కారం ఉందన్నారు.   రామాయపట్నం ఓడరేవును స్థానిక ప్రజల  అభిమతాన్ని దృష్టిలో పెట్టుకొని  తీర్చిదిద్దడానికి వారి భవిష్యత్తు కోసం అభివృద్ధిపరచి  ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందే అవకాశం ఉందన్నారు.  ఈ ఓడరేవుకు సంబంధించి అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఇక పునరావాస కార్యక్రమాలు త్వరలో ప్రారంభిస్తామన్నారు. భూములు కోల్పోతున్న వారికి 2013 చట్టాలను అనుసరించి ప్యాకేజ్ పూర్తిస్థాయిలో అందించి ఓడరేవు నిర్మాణ పనులు  ముమ్మరంగా చేపడతామన్నారు. ఈ ప్రాంతమంతా మెగా పరిశ్రమలు, ఎగుమతులతో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు.  జిల్లాలో కష్టపడి పనిచేసే నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు  మెండుగా లభిస్తాయన్నారు.


అనంతరం కందుకూరు శాసనసభ్యులు శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రామాయపట్నం ఓడరేవును వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చేస్తున్నది భూమి పూజ అని, భూమి పూజ అంటే పనులు మొదలు పెట్టడమేనని, గతంలో లాగా అబద్ధాలు చెప్పి కాలయాపన చేయడం కాదన్నారు.  భూమిపూజ చేసినప్పటి నుంచి ఎక్కడా పనులు ఆగకుండా త్వరితగతిన పోర్టు నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు చెప్పారు. పోర్టు ఏర్పాటుతో ఈ ప్రాంతం రూపురేఖలు మారనున్నాయని, ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించి గ్రామస్తుల అభిప్రాయాలను సేకరించి పట్టా భూములకు రావలసిన నష్టపరిహారాలను  చెల్లించామన్నారు. అలాగే ప్రభుత్వ భూములు సంబంధించి హక్కుదారుల వివరాలు సేకరించి వారికి నష్ట పరిహారం చెల్లించే ఏర్పాటు చేస్తామన్నారు. మత్స్యకారుల కుటుంబాలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో వారికి నష్టపరిహారం చెల్లించేందుకు అని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. 

అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ పోర్ట్ అథారిటీ ఎండి శ్రీ ప్రతాపరెడ్డి తో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.

జిల్లా కలెక్టర్ వెంట సంయుక్త కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మానాధ్, అదనపు ఎస్పీ శ్రీమతి హిమవతి,  కందుకూరు, కావలి, ఆత్మకూరు ఆర్డీవోలు శ్రీ జీవి సుబ్బారెడ్డి శ్రీ శీనా నాయక్, శ్రీ బాపిరెడ్డి, డిటిసి బి. చందర్, డిఎస్ఓ శ్రీ వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్స్ డిఎం శ్రీమతి పద్మ, డ్వామా పీడీ శ్రీ తిరుపతయ్య, రామాయపట్నం పోర్టు జనరల్ మేనేజర్ శ్రీ ఎం.ఎల్ నరసింహారావు, గుడ్లూరు, ఉలవపాడు తాసిల్దార్లు శ్రీమతి వి. లావణ్య, ఎండి హుస్సేన్, ఎన్ఐసి అధికారి సురేష్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు. 

Comments