ఉపాధి హామీ వేతనాల చెల్లింపులు

  తాడేపల్లి (ప్రజా అమరావతి);   ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం అంటే  2022-23లో  మదర్ శాంక్షన్ కింద కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం నాల్గో విడతగా రూ. 1769.29 కోట్లను మంజూరు చేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. ఇప్పటికే  మొదటి విడతగా రూ. 929.20 కోట్లు, రెండో విడతగా రూ.228.91కోట్లు, మూడో విడతగా రూ.670.58 కోట్లను మదర్ శాంక్షన్ గా  మంజూరు చేసిందని, అంటే ఈ ఆర్ధిక సంవత్సరానికి ఇప్పటి వరకు  మొత్తం రూ. 3,597.99 కోట్లకు మదర్ శాంక్షన్ ఇచ్చినట్లవుతుందని ఆయన వివరించారు.  కాగా ఇప్పటివరకు రూ. 1352.38 కోట్లు రోజువారీ వేతన ఎఫ్.టిఓల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు జమ అయ్యాయని, మిగిలిన మొత్తాలు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరలోనే  వేతనదారుల ఖాతాలకు జమ అవుతాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు.

Comments