అమరనాధ్ యాత్రకు వెళ్లిన తిరుపతి వాసులు సురక్షితం : జిల్లా కలెక్టర్

 *అమరనాధ్ యాత్రకు వెళ్లిన తిరుపతి వాసులు సురక్షితం : జిల్లా కలెక్టర్*



తిరుపతి , జూలై 10 (ప్రజా అమరావతి): అమరనాధ్ యాత్రకు వెళ్లిన తిరుపతి వాసులు సురక్షితంగా వున్నారని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణా రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రధాన భూ పరిపాలన కార్యాలయం (CCLA),సి ఎంఓ కార్యాలయం నుండి తిరుపతి కొర్లగుంట నివాసి బి మధుసూదన్ వివరాలు లభించలేదని సమాచారం అందడంతో వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ తిరుపతి అర్బన్ తహసీల్దార్  కి ఆదేశాలు ఇచ్చిన మేరకు తహసీల్దార్ వెంకటరమణ , డిటి రామచంద్ర ఆధార్ కార్డు లో వున్న అడ్రసుకు వెళ్లి విచారించగా అక్కడినుండి వారు నివాసం మార్చిన  కొత్తపల్లి వద్ద వారి కుటుంబసభ్యులతో మాట్లాడి, కుమారుడు అఖిల్ ను విచారించగా వారి తండ్రి సేఫ్ గా ఉన్నారని తెలుపగా వారి తండ్రి మొబైల్ నెంబర్ ను కలెక్టర్ గారికి పంపి వివరించారు. జిల్లా కలెక్టర్ స్వయంగా మధుసూదన్ కి ఫోన్ చేసి యోగ క్షేమాలు  విచారించగా తాను సురక్షితంగా ఉన్నానని సంఘటన జరిగే సమయానికి  తాను అక్కడి నుండి బయల్దేరి ఉన్నానని ప్రస్తుతానికి పంజాబ్  లూథియానా నుండి తిరుగుప్రయాణం లో ఉన్నట్లు తెలిపారు. సదరు సమాచారాన్ని రాష్ట్ర ప్రధాన భూ పరిపాలన కార్యాలయం (CCLA), సి ఎం ఓ కు జిల్లా యంత్రాంగం తెలిపారు.


తిరుపతి జిల్లా నుండి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన ఆరుగురు సభ్యుల బృందం సురక్షితంగా ఉందని సమాచారం.


Comments