విశాఖపట్నం (ప్రజా అమరావతి);
*వరుసగా నాలుగో ఏడాది...వైఎస్సార్ వాహన మిత్ర*
*బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన సీఎం శ్రీ వైఎస్ జగన్*
*ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు, లబ్ధిదారులు ఏమన్నారంటే*
*పినిపే విశ్వరూప్, రవాణా శాఖ మంత్రి*
ఈ రోజు చాలా సుదినం, గత చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు చూశాం, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాం, కానీ శ్రీ జగన్ గారు పాదయాత్ర సమయంలో ఆటో డ్రైవర్ సోదరులు ఆయన అడుగులో అడుగు వేసి నడిచారు.
అప్పుడే ఆయన చెప్పారు, ఇచ్చిన మాట ప్రకారం తొలి ఏడాదిలోనే నాలుగు నెలల ముందుగానే వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇదే కాదు మన కుటుంబాలను ఆదుకునే విధంగా అనేక పథకాలు తీసుకొచ్చారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని వినూత్న కార్యక్రమాలు చేసిన దాఖలాలు లేవు. శ్రీ జగన్ గారి ప్రభుత్వాన్ని చూసి అనేక ప్రభుత్వాలు తమ రాష్ట్రాలలో ఆ పథకాలు ప్రవేశపెడుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వం అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా ఆటో సోదరుల గురించి ఆలోచించిన వారిని చూశారా, ఈ రాష్ట్రంలోని ప్రతీ సామాజిక వర్గాన్ని , ప్రతీ కార్మిక వర్గాన్ని, ప్రతీ ఒక్కరినీ ఆదుకుంటున్న ప్రభుత్వం ఇది. గతంలో కూడా కుటుంబానికి ఒక్క పధకమే ఉండేది కానీ ఈ రోజు ఒకే ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందికి వస్తున్నాయి. గడప గడపకూ కార్యక్రమంలో మేం చూస్తున్నాం, ఒక్కొక్కరికీ లక్ష నుంచి రెండున్నర లక్షల వరకూ ప్రతీ కుటుంబంలో లబ్ధి చేకూరింది. సీఎం శ్రీ జగన్ గారు సీఎంగా ఉంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయి, లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని ప్రతిపక్షనేత చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు. టీడీపీ వాళ్ళు వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవడం తధ్యం, మన పిల్లల చదువులు ఆగిపోవడం తధ్యం, మన ఇంట్లో అమ్మ ఒడి రాదు, మన ఇంట్లో చేయూత రాదు, మన ఇంట్లో ఆసరా రాదు. ఈ వేళ చెప్పిన ప్రతీ మాట చెప్పిన సమయానికి నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి శ్రీ జగన్ గారు. మన పార్టీకి ఒకే ఒక టీవీ ఉంది, ఆటో సోదరులు కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ప్రచారకర్తలుగా, జగనన్న సైనికులుగా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి మీ ఆటోలో, మీ ట్యాక్సీలో ప్రయాణించే ప్రతీ ఒక్కరికీ చెప్పండి. ఈ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను కూడా చెప్పినప్పుడే ఆయన రుణం తీర్చుకున్నవాళ్ళం అవుతాం. 2024లో మళ్ళీ శ్రీ జగన్ గారి ప్రభుత్వం రాకపోతే నష్టపోయేది మనమే. 2024లో ఈ ప్రభుత్వం మళ్ళీ రావాల్సిన చారిత్రక అవసరాన్ని మీ ఆటోల ద్వారా ప్రయాణించే ప్రతీ ఒక్కరికీ కూడా మీరంతా తెలియజెప్పండి. ధ్యాంక్యూ.
*ఆటో డ్రైవర్, సిరియాలపేట, చీపురుపల్లి నియోజకవర్గం, విజయనగరం జిల్లా*
అన్నా నమస్కారం, నేను గత ఏడు సంవత్సరాలుగా గాజువాక పరిసర ప్రాంతాలలో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. నాకు రోజుకు రూ. 300, రూ. 400 వస్తాయి. మీరు పాదయాత్రలో మాకు ఒక మాట ఇచ్చారు. నేను అధికారంలోకి రాగానే మీకు మంచి చేస్తానన్నారు. జగనన్న మాట ఇస్తే తప్పని మనిషి, మడమ తిప్పడు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటో సోదరుడికి రూ. 10 వేలు ఇస్తున్నారు. అది కూడా నేరుగా మా అకౌంట్లో పడుతుంది. ఎక్కడా అవినీతి లేదు. ఆ డబ్బును ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్, మరమ్మత్తులకు ఇలా మాకు ఇష్టానుసారం ఖర్చుచేస్తున్నాం. మీకు మా ఆటో యూనియన్ల తరపున మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. కరోనా కష్టకాలంలో మేం ఆటో నడపలేక పోయేవాళ్ళం, ఆకలితో చచ్చిపోతామనుకున్నాం, కానీ మీరు ఒక తండ్రిలా మమ్మల్ని ఆదుకున్నారు. మాకు వాహన మిత్ర డబ్బులు ఇవ్వాల్సిన టైం కంటే ముందే ఇచ్చారు. మా కుటుంబం బతికిందంటే మీ దయ వల్లే, ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే మీ దయే. మేం కూడా ఆలోచించనంతగా మా పిల్లల కోసం కూడా మీరు ఆలోచించి అమ్మ ఒడి పథకం ద్వారా నాకు రూ. 15 వేలు ఏటా అందుతున్నాయి. నేను మా బాబుని మంచి చదువులు చదివించుకుంటున్నాను. అంతేకాదు నేను ఒక రైతు బిడ్డగా చెబుతున్నా, రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు రైతు భరోసా వస్తుంది, అంతేకాకుండా బోరు వేసి, మోటర్ ఇచ్చి రైతులను ఆదుకుంటున్నారు. మా రైతులకు ఆర్బీకేల ద్వారా మంచి రేట్లు వచ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరతో అమ్ముకుంటున్నాం. మా రైతు కుటుంబాల తరపున కూడా మీకు ధన్యవాదాలు. మా అమ్మకు ఫించన్ వస్తుంది, ఆమె బాధ్యత కూడా మీరే తీసుకున్నారు. భారతదేశంలో మేం ఎక్కడా వినలేదు, చూడలేదు. మీరు ఆణిముత్యాల్లాంటి పథకాలు తీసుకొచ్చి మా బడుగు, బలహీనవర్గాల కుటుంబాలలో ఆనందాలను నింపారు. మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది, మీరే మళ్ళీ మళ్ళీ సీఎంగా కావాలి, మాకు ఈ çపథకాలు ఇలాగే కొనసాగాలి, థ్యాంక్యూ సో మచ్ జగనన్న.
addComments
Post a Comment