పల్నాడు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నాం

 *పల్నాడు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నాం*


*-సిబ్బంది కొరతను తీర్చేందుకు ‘విద్యా వాలంటీర్ల’ ను నియమిస్తున్నాం.*

*-డిగ్రీ పట్టాదారులకు శిక్షణ ఇచ్చి, సాలరీలతో నియమిస్తున్నాం*

*-నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు*

*-పల్నాట విద్యావ్యవస్థ అభివృద్ధికి పెద్దపీట వేస్తాం– కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌*

*పల్నాడు పాఠశాలల్లో ‘విద్యావాలంటీర్ల’ లాంఛింగ్‌ ప్రోగ్రాం*


_నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవురాయలు.



 పల్నాడు ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చి, విద్యార్థులకు మంచి విద్యను అందించేందుకు అడుగులు వేస్తున్నాం.

 తొలిసారిగా ‘విద్యావాలంటీర్ల’ ను పల్నాడులోని ప్రభుత్వ పాఠశాలల్లో నియమించి, విద్యార్థులపై పర్యవేక్షణ, హాజరు శాతం పెరిగి మంచి ఫలితాలు రాబట్టేందుకు కృషి చేస్తున్నాం.

 డిగ్రీలు చదివిన వారికి 45రోజుల పాటు విజ్ఞాన్‌ సంస్థల ద్వారా అనుభవజ్ఞులైన సిబ్బందితో శిక్షణను అందించి, రూ.8వేల జీతంతో వారి సొంత ఊళ్లలోని ప్రభుత్వ పాఠశాలల్లో నియమిస్తున్నాం.

 విద్యావాలంటీర్లకు మరింత గైడెన్స్‌ ఇచ్చి ప్రభుత్వ టీచర్స్‌ వీరితో పనిచేయించుకోవాలి.

  ఇది విజయవంతమైతే.. తర్వాత ఏడాది 200 మందిని నియమించేందుకు అవకాశం ఉంటుంది.  

 సొంత ఊరు కావడం వల్ల వాలంటీర్లకు, గ్రామస్తులకు మంచి తత్సంబంధాలు ఉంటాయి, విద్యార్థుల పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది.

  మొత్తం 62 మందిని   వెల్దుర్తి, మాచవరం, బొల్లాపల్లి మండలాల్లోని.. 49 పాఠశాలల్లో, ఏటా  రూ.80లక్షల సాలరీలతో..అసిస్ట్, సింక్రనీ వారు, టీసీఎస్‌ వారి సహకారంతో నియమిస్తున్నాం.


పల్నాడు జిల్లా కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌

  పల్నాడు విద్యా వ్యవస్థ బాగుపడేందుకు కృషి చేస్తామని, విద్యావాలంటీర్ల నియమించడం అనేది మంది ఆలోచన.

  ప్రతి పాఠశాల అభివృద్ధిపై  ప్రత్యేక శ్రధ తీసుకుని ముందుకు సాగుతున్నాం.

 చాలా మంది రాజకీయ నాయకులను చూసానని, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వినూత్న ఆలోచనలతో చేస్తున్న ప్రజా సేవ నిజంగా అభినందిచాల్సిందే.

 ఈ సందర్భంగా ఎంపీ, కలెక్టర్‌ చేతుల మీదుగా వాలంటీర్లకు నియామక పత్రాలను అందించారు.

Comments