ప్రజలకు అందుబాటులో వుండి మెరుగైన సేవలు అందించాలి

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


ప్రభుత్వం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు  చేరువ చేసేందుకు   కృషి చేయడంతో పాటు ప్రజలకు  అందుబాటులో  వుండి మెరుగైన సేవలు అందించాల


ని  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  సచివాలయ సిబ్బందిని   ఆదేశించారు.


శనివారం ఉదయం నెల్లూరు రూరల్ మండలం, గుండ్లపాలెంలోని  17/3  సచివాలయాన్ని, వై.ఎస్.అర్.నగర్ లోని  31/1, 31/3 సచివాలయాన్ని జిల్లా  కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  సచివాలయ హాజరు రిజిస్టర్లను,  రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సచివాలయ సిబ్బంది క్రమశిక్షణతో పనిచేసి  ఎటువంటి దరఖాస్తులు పెండింగ్ లేకుండా సత్వరం పరిష్కరించేలా  కృషి చేయడంతో పాటు  ప్రజలకు నిత్యం అందుబాటులో  వుండి,  ప్రజలు సంతృప్తి చెందేలా మెరుగైన సేవలు అందించాలన్నారు. సచివాలయ పరిధిలో  ప్రతి రోజు ఎన్ని అర్జీలు వస్తున్నాయి,  వచ్చిన  అర్జీల్లో  ఎన్ని పరిష్కరించారు,  ఎన్ని బియాండ్ ఎస్.ఎఎల్.ఎ లో వున్నాయి అని జిల్లా కలెక్టర్  సచివాలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామ వాలంటీర్లు,  గ్రామ సచివాలయ సిబ్బంది  ప్రత్యేక శ్రద్ధ తీసుకొని  అర్హులందరూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సంబందిత లబ్ధిదారులు   సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ సర్వీసెస్ పై ప్రజల్లో అవగాహన కల్పించి  రెవెన్యూ సర్వీసెస్ ను ఇంప్రూవ్మెంట్ చేయాలని జిల్లా కలెక్టర్, సచివాల సిబ్బందిని ఆదేశించారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ  అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు  అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్  శ్రీ చక్రధర్ బాబు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.  రెండు విడతల కోవిడ్ వ్యాక్సినేషన్  ప్రక్రియను బాగా చేపట్టారని, బూస్టర్ డోసు ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ఏ.ఎన్.ఎం లను ఆదేశించారు.  ఆగస్టు 1వ తేదీ నుండి నిర్వహిస్తున్న  ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధాన కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహించాలని  జిల్లా కలెక్టర్, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.


జిల్లా కలెక్టర్ వెంట నెల్లూరు రూరల్ తహసిల్ధార్ శ్రీ వెంకటేశ్వర్లు,  నెల్లూరు నగర కార్పొరేషన్ ఈ.ఈ శ్రీ సంజయ్, వార్డు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments