నెల్లూరు (ప్రజా అమరావతి);
మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గారి త్యాగశీలిని, పోరాటపటిమను స్పూర్తిగా తీసుకొని నేటి యువత దేశాభివృద్ధి కోసం, సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.
సోమవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు గారి 125 వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, జ్యోతి ప్రజ్వలన గావించి, అల్లూరి సీతారామ రాజు గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అల్లూరి సీతారామ రాజు గారి 125 వ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నామని, దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయులు అల్లూరి సీతారామ రాజు
అని అన్నారు. వారి త్యాగశీలిని, పోరాటపటిమను స్పూర్తిగా తీసుకొని నేటి యువత సమాజాభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ఎటువంటి అభివృద్ధి లేని గోదావరి ఏజన్సీ ప్రాంతంలో గిరిజన తెగ వారిలో దేశభక్తిని రగిలించి స్వాతంత్ర్య విప్లవానికి నాంది పలికిన దేశభక్తుడు అల్లూరి సీతారామ రాజు అని జిల్లా కలెక్టర్ వారి త్యాగాన్ని గుర్తుచేశారు. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించారని, తెలుగు వారు వున్నంత కాలం మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు పేరు గుర్తుండిపోతుందని, వారి పేరుతో నేడు జిల్లాను ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా బదిలీ కాబడిన శ్రీ రోణంకి కూర్మనాథ్ మాట్లాడుతూ, సమాజంలో గిరిజనలు పడుతున్న బాధలు, వారి పై జరుగుచున్న అన్యాయాలను చూసి వారికి అండగా నిలిచి వారి కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడి ప్రాణ త్యాగం చేసిన మహనీయు అల్లూరి సీతారామ రాజు అని అన్నారు. అల్లూరి సీతారామ రాజు సారధ్యం లో సాగిన ఉద్యమానికి రంప విప్లవంగా పిలవబడినదని అన్నారు. అతి తక్కువ కాలంలోనే ఆయన స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలు అర్పించారన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, డిల్ సోషల్ వెల్ఫేర్ డిడి శ్రీమతి రమాదేవి, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పిడి శ్రీ సాంబశివా రెడ్డి, డి.ఎస్.డబ్ల్యూ.ఓ శ్రీ వెంకటయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment