విద్యార్థులకు సమాజంపై అవగాహన కలిగేలా విద్యా బోధన చేయండి

 విద్యార్థులకు సమాజంపై అవగాహన కలిగేలా విద్యా బోధన చేయండి 



ఉపాధ్యాయుల సదస్సులో కలెక్టర్ 'శివశంకర్' హితవు 


నరసరావుపేట, 02 జులై (ప్రజా అమరావతి) :  పల్నాడు జిల్లా కలెక్టరేట్ లో విద్యా వార్షిక ప్రణాళిక కార్యక్రమం పై స్పందన హాల్ నందు శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులతో  జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం లో ఉపాధ్యాయులు విద్యార్థులకు సమాజం పై అవగాహన వచ్చేలా విద్యా బోధన చేయాలన్నారు. భవిష్యత్తు లో విద్యార్థులు సమాజానికి మేలు చేసేలా ఉత్తమ పౌరులుగా తీర్చి   దిద్దాలని సూచించారు. దీనికి సంబంధించి ప్రణాళిక లు తయారు చేసే విధానాన్ని 'నెల.. నెలా వెన్నెల' కార్యక్రమం పేరుతో సంస్కృతి, సంప్రదాయాలు,క్రీడలు, పర్యాటక ప్రదేశాల సందర్శన, మేధోసంపత్తి, భవిత, యోచన వంటి విద్యా బోధన విభిన్నంగా ఉండేలా  చేపట్టాలని పేర్కోన్నారు. 2022 జూన్ నెల నుంచి 2023 మే నెల వరకు విద్యార్థులకు చెప్పే విద్యా వార్షిక ప్రణాళిక కు సంబంధించి గతంలో తాను తయారుచేసిన విద్యా వార్షిక ప్రణాళిక మాదిరిని ప్రధానోపాధ్యాయులకు అందించి అదే తరహాలో విద్యా వార్షిక ప్రణాళికను తయారు చేయాలని ప్రణాళికలను తయారు చేసిన తర్వాత ఆ నివేదికను జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పంపాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయ ఆలోచనలను జోడించి ఈ ఏడాది విద్య ను విద్యార్థుల్లో విజ్ఞానం పెంచేలా తీర్చి దిద్దాలన్నారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్, గురుకుల, గిరిజన, జిల్లా పరిషత్తు,కే.జి.బి వి, మోడల్, ఏపి రేసిడెన్సియల్, సి.ఎస్.ఇ. ఎయిడెడ్, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ కు చెందిన యాజమాన్య టీచర్లు, పలువురు అధికార్లు తదితరులు పాల్గొన్నారు.                  



Comments