*ముఖ్యమంత్రితో నీతి ఆయోగ్ సభ్యుడు భేటీ.*
అమరావతి. (ప్రజా అమరావతి);
*–సీఎం శ్రీ వైయస్.జగన్‌తో నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్, బృందం భేటీ.*
*- క్యాంపు కార్యాలయంలో సమావేశం.*
– తలసరి ఆదాయం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశుసంపద తదితర రంగాల్లో దేశసగటు కన్నా.. ఏపీలో వృద్ధి చాలా బాగుందని రమేష్ చంద్ ప్రశంసలు.
– దీనికి సంబంధించిన గణాంకాలను సీఎంకు వివరించిన రమేష్ చంద్.
– దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా మెరుగ్గా ఉందన్న రమేష్ చంద్.
– ప్రతీ రంగంలో లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్న తీరును ప్రశంసించిన రమేష్‌చంద్.
– జీరోబేస్డ్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ వ్యవసాయం తదితర అంశాలపై సమావేశంలో చర్చ.
– పండ్లు, మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ నంబర్ ఒన్ అన్న రమేష్ చంద్.
– ఆయిల్‌పామ్ సాగుద్వారా వంటనూనెలు ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించిందని ప్రశంస.
– ఆర్బీకేల ద్వారా రైతులకు సమగ్ర వ్యవస్థ అందుబాటులో ఉందన్న నీతిఆయోగ్ సభ్యుడు.
– క్షేత్రస్థాయిలో అత్యుత్తమ వ్యవస్థ అని కొనియాడిన రమేష్‌చంద్.
– హయ్యర్ ఎడ్యుకేషన్‌లో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ దేశం సగటు కన్నా ఏపీ సగటు అధికమన్న రమేష్ చంద్.
– రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను వివరించిన సీఎం.
– వ్యవసాయం, వైద్య, విద్య, గృహనిర్మాణ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చామన్న సీఎం.
– ఈ రంగాల్లో చాలా కార్యక్రమాలు చేపడుతున్నామన్న సీఎం.
– గర్భవతులు, బాలింతలు, చిన్నారులు, బడిపిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా సంపూర్ణపోషణ, గోరుముద్ద లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్న సీఎం.
– మహిళా సాధికారితకోసం బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నామన్న సీఎం.
– ప్రతి యాభైఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెట్టామని, గ్రామ–వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వివక్షకు, అవినీతికి ఆస్కారం లేకుండా డెలివరీ మెకానిజంను సమర్థవంతంగా నడిపిస్తున్నామన్న సీఎం.
– డీబీటీ విధానంలో ఏపీది అగ్రస్థానమన్న సీఎం.
– పిల్లలను బడికి పంపించేలా తల్లులను చైతన్యపరచడానికి అమ్మ ఒడిని అమలు చేస్తున్నామన్న సీఎం.
– దీనివల్ల జీఈఆర్ పెరుగుతుందన్న సీఎం.
– విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామన్న సీఎం.
– ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా పిల్లలను తయారుచేస్తున్నామన్న సీఎం.
– ఏ రంగంలోనైనా రాణించాలంటే.. ఇంగ్లిషు, నాణ్యమైన విద్య చాలా అవసరమన్న సీఎం.
– నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామన్న సీఎం.
– తరగతిగదులను డిజిటల్ ఉపకరణాలతో తీర్చిదిద్దుతున్నామన్న సీఎం.
– సబ్జెక్టుల వారీగా బోధనకు టీచర్లను నియమిస్తున్నామని, ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం.
– పూర్తి స్థాయి రీయింబర్స్ మెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అన్న సీఎం. అలాగే వసతి దీవెన కింద కూడా ఏడాదికి రూ.20వేలు ఇస్తున్నామన్న సీఎం.
– దీనివల్ల జీఈఆర్ గణనీయంగా పెరుగుతుందన్న సీఎం.
– ప్రభుత్వాసుపత్రుల్లో , బోధనాసుపత్రుల్లో నాడు – నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నామన్న సీఎం.
ప్రతి గ్రామంలో, వార్డుల్లో కూడా విలేజ్, వార్డు క్లినిక్స్‌పెడుతున్నామన్న సీఎం.
– ఆరోగ్యశ్రీకి రిఫరల్‌పాయింట్‌గా, వ్యాధుల నివారణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయన్న సీఎం. పీహెచ్‌సీలతో, అక్కడున్న డాక్టర్లతో అనుసంధానమవుతాయన్న సీఎం.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను కూడా అమల్లోకి తీసుకువస్తున్నామన్న సీఎం.
– 3వేలకు పైగా చికిత్సలకు ఆరోగ్యశ్రీద్వారా ఉచిత చికిత్స అందిస్తున్నామన్న సీఎం.
– ప్రతిపార్లమెంటు నియోజకవర్గంలో తప్పనిసరిగా మెడికల్‌కాలేజీ ఉండేలా కొత్తగా 16 మెడికల్‌కాలేజీలను నిర్మిస్తున్నట్టు తెలిపిన సీఎం.
– ఆర్బీకేల వ్యవస్థ, సీఎంయాప్ పనితీరు తదితర అంశాలను వివరించిన సీఎం.
– ఫుడ్ ప్రాససింగ్‌కోసం కొత్తగా చేపడుతున్న 26 యూనిట్ల గురించి వివరించిన సీఎం.
– రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఇతర కార్యక్రమాలనూ వివరించిన సీఎం.
addComments
Post a Comment