రణధీర్ కుమార్ ను అభినందించిన ఆర్ధిక శాఖ కార్యదర్శి కెవివి. సత్యనారాయణ..

 

విజయవాడ (ప్రజా అమరావతి);


* ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్ పోటీలో విజయం సాధించిన PAO ఉద్యోగి రణధీర్ కుమార్ ను అభినందించిన ఆర్ధిక శాఖ కార్యదర్శి కెవివి. సత్యనారాయణ..  


ఫిన్ ల్యాండ్ లో జరిగిన 24వ ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్న రణధీర్ కుమార్ ను ఆర్ధిక శాఖ కార్యదర్శి కెవివి. సత్యనారాయణ అభినందించారు.    ప్రపంచంలోని 92 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో భారతదేశం తరపున 800 మీటర్ల పరుగు పోటీలో విజయం సాధించడం పట్ల ఇబ్రహీంపట్నం లోని PAO కార్యాలయ ఉద్యోగులు అభినందనలు తెలియజేసారు.  కార్యాలయంలో పర్యవేక్షకులుగా పనిచేస్తున్న రణధీర్ కుమార్ ఫిన్ ల్యాండ్ లో జరిగిన అథ్లెటిక్ 800 మీటర్ ల పరుగు పోటీలో 30వ స్థానంలో నిలిచారు   


Comments