జగనన్న సంకల్పం - గ్రామ సచివాలయాల ఆవిర్భావం.
కొల్లిపర (ప్రజా అమరావతి);
జగనన్న ఇచ్చిన ఒక్కమాటతో 1,34,000 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం. గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినందుకు కృతజ్ఞతగా కొల్లిపర మండలంలోని అన్ని గ్రామాల సచివాలయ ఉద్యోగులు అందరు కలిసి అభినందన సభ ఏర్పాటు చేసి, తెనాలి నియోజకవర్గం శాసన సభ్యులు
అన్నాబత్తుని శివకుమార్ గారిని గజమాలతో సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం కొల్లిపర గ్రామంలోని పాలకేంద్రం కళ్యాణ మండపంలో జరిగింది.
addComments
Post a Comment