ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన క్షత్రియ సేవా సమితి (ఏపీ, తెలంగాణ) ప్రెసిడెంట్, వైస్‌ ప్రెసిడెంట్, సభ్యులు.

 

అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన క్షత్రియ సేవా సమితి (ఏపీ, తెలంగాణ) ప్రెసిడెంట్, వైస్‌ ప్రెసిడెంట్, సభ్యులు.ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపి, మెమెంటో అందజేసిన క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు.


అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు జాతీయ స్ధాయిలో ప్రాధాన్యం కల్పించడంతో క్షత్రియులంతా అండగా ఉంటామని ముఖ్యమంత్రికి తెలిపిన క్షత్రియ సేవా సమితి ప్రతినిధులు.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, క్షత్రియ సేవా సమితి ప్రెసిడెంట్‌ పేరిచర్ల నాగరాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ వి.వెంకటేశ్వర రాజు, జాయింట్‌ సెక్రటరీ డివిఎస్‌ఎస్‌ఎన్‌.రాజు, ట్రెజరర్‌ పి.వెంకటేశ్వర రాజు, క్షత్రియ సేవా సమితి ఫెడరేషన్‌ చైర్మన్‌ సీహెచ్‌.వెంకటపతి రాజు, సెక్రటరీ డీఎస్‌ఎన్‌. రాజు, వైస్‌ చైర్మన్‌ ఆంజనేయ రాజు, గాదిరాజు సుబ్బరాజు.

Comments