పోర్టుల వల్లే మహానగరాలు...


నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి);


*శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు తొలిదశ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:*

 

దేవుడి దయతో ఈ రోజు మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రామాయపట్నం పోర్టుకు ఈరోజు భూమిపూజ జరిగింది. ఈ భూమిపూజ జరుగుతున్న నేపధ్యంలో.. ఒక పోర్టు రావడంవల్ల  జరిగే మంచి ఏమిటన్నది మనలో చాలామందికి తెలుసు. 


*పోర్టుల వల్లే మహానగరాలు...*



అటువైపు చెన్నై, ఇటువైపు విశాఖపట్నం, మరోవైపు ముంబాయి ఇలా ఏ నగరమైనా పెద్ద నగరంగా, మహానగరంగా ఎదగాయంటే.. అక్కడ పోర్టు ఉండడమే. దీన్ని దేవుడు ఇచ్చిన వరంగా భావించవచ్చు.  పోర్టు రావడం వల్ల ఉదోగ అవకాశాలు చాలా పెరుగుతాయి. పోర్టు రావడం వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పెరుగుతాయి.  పోర్టు వల్ల ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చులు తగ్గిపోతాయి. నీటి రవాణా చాలా తక్కువతో కూడుకున్న వ్యవహారం.

తద్వారా రాష్ట్రానికే కాకుండా.. ఈ ప్రాంతం రూపురేఖలు కూడా మారతాయి.



*75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే...*

రాష్ట్రంలో ఒక చట్టాన్నే తీసుకొచ్చాం. ఎక్కడ ఏపరిశ్రమ వచ్చినా రాష్ట్రంలో 75 శాతం ఉద్యోగాలు స్ధానికులకే ఇవ్వాలని ఏకంగా చట్టమే తీసుకొచ్చిన ప్రభుత్వం మనది. దీని ఆధారంగా పోర్టులు కానీ, దీనికి  అనుసంధానంగా వచ్చిన పరిశ్రమలు కానీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చే  అన్ని పరిశ్రమలు కూడా స్ధానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వక తప్పని పరిస్థితి ఆటోమేటిక్‌గా ఉంటుంది.  కాబట్టి ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి. ఈ రాష్ట్రానికి కూడా ఊతం వస్తుంది. 



*గతంలో మన పోర్టుల పరిస్థితి....*

రాష్ట్రంలో  మన పరిస్థితి ఏమిటి అని గమనిస్తే.. మన దగ్గర దాదాపు 6 పోర్టులు ఉన్నాయి. కృష్ణపట్నం, కాకినాడలో 2, విశాఖపట్నం, గంగవరం, తదితర  ప్రాంతాల్లో ఉన్నాయి.  వీటిలో విశాఖపట్నం కాకుండా మిగిలిన పోర్టులు కెపాసిటి 158 మిలియన్‌ టన్నులు ఉంటే.. విశాఖపట్నం పోర్టు మరో 70 మిలియన్‌ టన్నుల సామర్ధ్యం కలిగి ఉంది. 


*మన హయాంలో కొత్తగా 4 పోర్టులు– 9 ఫిషింగ్‌ హార్భర్లు.*

స్వాతంత్య్రం వచ్చినప్పుటి నుంచి ఇప్పటివరకు మనకు కేవలం 6 పోర్టులుంటే మనం ఏకంగా మరో 4 పోర్టులను అదనంగా నిర్మించబోతున్నాం. అంటే ఈ 5 సంవత్సరాలలో మరో 4 పోర్టులు.. భావనపాడు, కాకినాడ గేట్‌వే పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నంలు రానున్నాయి.  వీటి ద్వారా మరో 100 మిలియన్న టన్నుల కెపాసిటీకి కూడా వస్తోంది. 

ఈ నాలుగు పోర్టులతో పాటు రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్‌లు కూడా వేగవంతంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. బుడగట్లపాలెం, పూడిమడక, ఉప్పాడ, బియ్యపుతిప్పలతో  పాటు మచిలీపట్నం, నిజాంపట్నం, ఓడరేవు, కొత్తపట్నంతో పాటు జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్భర్‌లు నిర్మాణం జరుపుకుంటున్నాయి. 


*మరో రెండు నెలల్లో మిగిలిన పోర్టులూ...*

పోర్టులకు సంబధించిన నిర్మాణపనులు ఈ రోజు నుంచి వేగవంతం అవుతున్నాయి. మరో రెండు నెలల తిరక్క మునుపే మిగిలిన పోర్టులకు కూడా భూమిపూజ చేసుకునే దిశగా పనులు వేగవంతం అవుతున్నాయి. ఇలా 4 పోర్టులు, 9 ఫిషింగ్‌ హార్భర్లు రానున్నాయి.


*లక్ష మంది గంగపుత్రులకు మన రాష్ట్రంలోనే ఉద్యోగ, ఉపాధి...*

 మన దగ్గర ఉన్న 6 పోర్టులను గమనిస్తే.. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక షిషింగ్‌ హార్భర్‌ కానీ, పోర్టు కానీ కనిపించే పరిస్థితుల్లోకి రాష్ట్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. 9 ఫిషింగ్‌ హార్భర్లు పూర్తి అయితే.. వీటి ద్వారా 1లక్ష మంది మత్స్యకార కుటుంబాలు ఉద్యోగ, ఉఫాధి అవకాశాలకు గుజరాత్‌ వంటి ప్రాంతాలకో,వేరెక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలోనే ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. మనం ఇవాళ మాట్లాడుకుంటున్న నాలుగు పోర్టులు కాకినాడ ,మచిలీపట్నం, భావనపాడు, రామాయపట్నం ద్వారా కూడా ఒక్కోక్క పోర్టులో నేరుగా కనీసం 3–4 వేలమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పరోక్షంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు రావడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. మొత్తంగా లక్షల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలకు నాంది పలుకుతున్నాం.


*రామాయపట్నం పోర్టు గురించి నాలుగు మాటలు మాట్లాడాలంటే...*

2019 ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగితే... అప్పటి పాలకులు చంద్రబాబునాయుడు. 2019 ఫిబ్రవరిలో ఇక్కడికి వచ్చి శంకుస్ధాపన చేసారు. డీపీఆర్‌ లేదు, భూసేకరణలేకుండా ప్రజలను మోసం చేయాడానికి ఆ రోజు ఇక్కడకి వచ్చి శంకుస్ధాపప కోసం టెంకాయ కొట్టిపోయారు. ఐదు సంవత్సరాలు ఏం చేయకుండా ఎన్నికలకు రెండు నెలల ముందు శంకుస్ధాపన అంటే ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడమే. ఇంతకన్నా అన్యాయం, మోసం ఎక్కడైనా ఉంటుందా ? గతపాలనలో మనం చూశాం. రుణమాఫీ అంటూ రైతులను మోసం ? రుణమాఫీ అంటూ అక్కచెల్లెమ్మలను మోసం ? ఉద్యోగాలు అంటూ చదువుకుంటున్న పిల్లలనూ మోసం చేశారు. 


*రూ.3700 కోట్లతో రామాయపట్నం పోర్టు పనులు.*.

ఈ రోజు పోర్టు కోసం 850ఎకరాల భూమి కూడా పూర్తిగా సేకరించి... రూ.3700 కోట్లతో పనులు కూడా మొదలయ్యే కార్యక్రమం జరుగుతుంది. పోర్టు ద్వారా 4 బెర్తులు పూర్తిగా అందుబాటులోకి వస్తాయి. మరో 6 బెర్తులు కూడా ఇదే ఇన్‌ఫ్రాస్చ్రక్టర్‌లోనే వచ్చే అవకాశాలున్నాయి. ఒక్కోదానికి రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మిగిలిన ఆరు బెర్తులు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ 4 బెర్తుల ద్వారా 25 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా చేసే సామర్ధ్యం లభిస్తే... మరో రూ.1200 కోట్లు మనం ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజు పెట్టుబడి పెడితే... ఏకంగా 50 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా చేయవచ్చు.


*సహకరించిన వారికి కృతజ్ఞతలు...*

పోర్టు వల్ల మంచి జరగాలని దేవుడిని మనసారా కోరుకుంటూ.. ఈ ప్రాంతంలో పోర్టు రావడానికి సహకరించిన మొండివానిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం కాకుండా రావూరు, చేవూరు, సాలిపేట గ్రామస్ధులందరికీ నిండుమనస్సుతో చేతులు జోడించి పేరు, పేరునా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజు మన భూమిలిచ్చి.. పోర్టు రావడానికి మనం వేసిన అడుగులు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖంచబడతాయి. 

కారణం  రాబోయే దశాబ్ద కాలంలో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయి. మన పిల్లలందరూ ఎక్కడికెక్కడికో వెళ్లి ఉద్యోగాలు వెదుక్కునే అవకాశం లేకుండా.. మన గ్రామాల నుంచి పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 



*చివరిగా...*

 కావలి ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ..  ఈ పోర్టుకు అనుసంధానంగా ఒక పారిశ్రామిక  కారిడార్‌ కూడా వస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ అభివృద్ధి కనపిస్తుందని చెప్పారు. పారిశ్రామిక వేత్తలు ఇక్కడికి వచ్చే అవకాశాలు పెరుగుతాయి అన్నారు. కావలి నియోజకవర్గం పక్కనే ఉంది.. రైతులు భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇండస్ట్రియల్‌ కారిడార్‌ నెలకొల్పాలని అడిగారు. అది మంచి ఆలోచనే. రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 


కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి మాట్లాడుతూ..  బైపాస్‌ రోడ్డు కోసం 6.2 కిలోమీటర్ల భూసేకరణ చేయాలన్నారు. మంచి పోర్టు వచ్చి ఇక్కడ పరిస్థితులు మారుతున్నప్పుడు.. కందుకూరు పట్టణం పెద్ద హబ్‌గా తయారవుతుంది. అటువంటి పరిస్థితుల్లో రోడ్లకు సంబంధించి కందుకూరు బైపాస్‌ రోడ్డు భూసేకరణ కోసం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నాం. కందుకూరు మున్సిపాల్టీ అభివృద్ధి కోసం కూడా నా వంతు సహాయ,సహకారాలు అందిస్తాను. అదే విధంగా రాళ్లపాడు ఎడమ కాలువ విస్తరణకు సంబంధించి 8,500 ఎకరాలకు నీళ్లందించే పనులకోసం మరో రూ.27 కోట్లు కావాలన్నారు. ఆ నిధులు కూడా మంజూరు చేస్తున్నాం. ఉలవపాడు మండలంలోని కారేడులో పీహెచ్‌సీ శాశ్వతభవనం అడిగారు. అది కూడా మంజూరు చేస్తున్నాం. ఈ ప్రాంతానికి మంచి జరగాలని.. ఈ పోర్టు  నిర్మాణంతో ఇక్కడ రూపురేఖలు పూర్తిగా మారే పరిస్థితి రావాలని...మీ అందరి చల్లని దీవెనలు, దేవుడి దయతో మీకు మంచి చేసే అవకాశం ఇవ్వాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

Comments