శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి); నందు హుండీల ద్వారా వచ్చిన మిశ్రమ బంగారము , నిరుపయోగము గా ఉన్న బంగారు వస్తువులును మరియు అలంకారమునకు వినియోగ పడని బంగారు వస్తువులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము గోల్డు బాండ్ స్కీము రూపములో మార్చుటకు గాను కమిటీని ఏర్పాటు చేసి తేది: 07-07-2022 న ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు, రీజనల్ జాయింట్ కమీషనరు , మల్టీజోన్ -1 , దేవాదాయ శాఖ, రాజమహేంద్రవరం శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు,  జ్యూవలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ దుర్గా భవానీ గారు,  దేవస్థానము కమిటీ సభ్యులు, ఎస్.పి.ఎఫ్ సిబ్బంది వారి సమక్షములో బంగారు వస్తువులను అప్రైజ్మెంట్ చేయగా వచ్చిన బంగారము కేజి 10-453 -000 గ్రా లను  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గాంధీనగర్, విజయవాడ వారికి  గోల్డు బాండ్ స్కీము నిమిత్తం అప్పగించడమైనది.

Comments