రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 13,14,15 తేదీలలో ఘనంగా జెండా పండగ

 *రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 13,14,15 తేదీలలో ఘనంగా జెండా పండగ*


*15వ తేదీన గుంటూరు చేబ్రోలు హనుమయ్య ప్ర్రాంగణంలో హర్ ఘర్ తిరంగా  వేడుకలు*


*15న ఉదయం 8.30 గంటలకు గుంటూరులో జాతీయ జెండా ఆవిష్కరించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*


అమరావతి (ప్రజా అమరావతి); భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  పిలుపుమేరకు టీడీపీ ఆధ్వర్యంలో ఈ నెల 13 నుంచి 15 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా  ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుపనున్నారు. 15న గుంటూరు స్తంబాల గరువు మెయిన్ రోడ్డు లోని చేబ్రోలు హనుమయ్య ప్ర్రాంగణంలో జరిగే  ఆజాదీకా అమృత్ వేడుకల్లో ఉదయం 8.30 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన బహిరంగసభలో ప్రసంగిస్తారు. 13, 14, 15 తేదీలలో ప్రతి తెలుగుదేశం కార్యకర్త తమ ఇళ్లపై మువ్వన్నెల జాతీయ జెండాలు ఎగురవేయాలని చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. దేశంపై తమ బాధ్యతను, దేశభక్తిని చాటాలని పేర్కొన్నారు. 15న గుంటూరులో జరిగే కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తమ వాహనాలకు (పార్టీ  జెండాలతో కాకుండా)  *జాతీయ జెండాలను* మాత్రమే కట్టుకుని రావాలని చంద్రబాబు నాయుడు సూచించారు.

Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image