ఈనెల 15న అసెంబ్లీ,సచివాలయం,హైకోర్టుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 ఈనెల 15న అసెంబ్లీ,సచివాలయం,హైకోర్టుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

అమరావతి,12 ఆగస్టు (ప్రజా అమరావతి):భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 15వ తేది సోమవారం ఉదయం 8గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ భవనంపై శాసన మండలి వద్ద శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్ రాజు మువ్వన్నెల జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.అదే విధంగా అసెంబ్లీ భవనం వద్ద ఉ.8.15గం.లకు రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.

సచివాలయం మొదటి బ్లాకువద్ద సిఎస్.డా.సమీర్ శర్మ జాతీయ జెండా ఎగురవేయనున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 15వతేదీ ఉదయం 7.30 గం.లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.

హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పశాంత్ కుమార్ మిశ్రా జాతీయ జెండా ఎగురవేస్తారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈనెల 15వతేదీ సోమవారం ఉ.10 గం.లకు హైకోర్టులో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు.

      

Comments