అర్హులై ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24,000 ఆర్ధిక సాయం


అమరావతి (ప్రజా అమరావతి);


*నేడు (25.08.2022, గురువారం) వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ నేతన్న నేస్తం*


*కృష్ణా జిల్లా పెడనలో బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*


*రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లు జమచేయనున్న ముఖ్యమంత్రి*.


*మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నేతన్నలకు ఇస్తున్న కానుక...వైఎస్సార్‌ నేతన్న నేస్తం. వరుసగా నాలుగో ఏడాది కూడా నేతన్నకు ఆపన్న హస్తం అందించేలా వైఎస్సార్‌ నేతన్న నేస్తం*.


*అర్హులై ఉండి స్వంత మగ్గం కలిగిన ప్రతీ చేనేత కుటుంబానికి ఏడాదికి రూ. 24,000 ఆర్ధిక సాయం అందిస్తున్న శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం*


*నేడు అందిస్తున్న రూ. 193.31 కోట్లతో కలిపి ఇప్పటివరకూ నేరుగా నేతన్నలకు కేవలం ఈ పథకం ద్వారా  అందించిన మొత్తం సాయం రూ. 776.13 కోట్లు*. 


*శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వైఎస్సార్‌ నేతన్న నేస్తం క్రింద రూ. 776.13 కోట్లు, నేతన్నల పెన్షన్‌ కోసం రూ. 879.8 కోట్లు, ఆప్కోకు చెల్లించింది రూ. 393.3 కోట్లు, మొత్తంగా మూడేళ్ళలో నేతన్నల సంక్షేమం కోసం వెచ్చించిన మొత్తం రూ. 2,049.2 కోట్లు*.


*నేతన్నలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా క్రమం తప్పకుండా ప్రతి ఏటా అదే కుటుంబానికి ఆర్ధికసాయం అందిస్తూ, వారికి తోడుగా ఉంటూ, చేనేత వృత్తిని గిట్టుబాటు చేస్తూ, నేడు అందిస్తున్న సాయంతో కలిపి అర్హుడైన ప్రతి నేతన్నకు అందించిన మొత్తం సాయం రూ. 96,000*.


*చేనేత కార్మికులు ఈ ఆర్ధిక సహాయంతో తమ మగ్గాలను డబుల్‌ జాకార్డ్, జాకార్డ్‌ లిఫ్టింగ్‌ మెషిన్‌ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్‌ చేసి క్రొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయడం వల్ల 2018 – 19 లో రూ. 4,680 గా ఉన్న వారి నెలవారీ ఆదాయం...పథకం అమలు తర్వాత 3 రెట్లు పెరిగి రూ. 15,000కు చేరింది*


*శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్ళలో గత ప్రభుత్వం పెండింగ్‌ పెట్టిన రూ. 103 కోట్ల బకాయిలతో సహా రూ. 393.30 కోట్ల నిధులు నేతన్నల సంక్షేమం కోసం ఆప్కోకు ఇవ్వడం జరిగింది*


*ఆప్కో వస్త్రాలకు ఆన్‌లైన్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్ధలైన అమేజాన్, మింత్ర, ప్లిప్‌కార్ట్, గోకూప్, లూమ్‌ఫోక్స్, మిర్రా, పేటీఎం వంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకున్న శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం, తద్వారా ఆప్కో వస్త్రాలకు పటిష్టమైన మార్కెటింగ్‌ సౌకర్యం*


*వైఎస్సార్‌ నేతన్న నేస్తం గురించి బ్రీఫ్‌గా...*


దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నలకు లబ్ధి చేకూర్చే పథకాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టిన ప్రభుత్వం

అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా వివిధ సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి మరో అవకాశాన్ని కూడా ఇస్తూ, ప్రతి ఏటా జూన్, డిసెంబర్‌లలో లబ్ధి అందజేత


శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇచ్చే ఆర్ధిక సాయాన్ని బ్యాంకులు పాత అప్పులకు జమ చేయరాదని ఇప్పటికే వారికి అదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. 


నేతన్నలు గౌరవప్రదంగా జీవించేందుకు ఆపన్న హస్తం అందిస్తుంది శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

 

కరోనా కారణంగా ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న చేనేత కుటుంబాలకు మేలు జరిగేలా డిసెంబర్‌ 2020లో అందించాల్సిన ఆర్ధిక సాయాన్ని 6 నెలల ముందే అందించిన శ్రీ వైయస్‌ జగన్‌ ప్రభుత్వం


కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావు లేకుండా సొంత మగ్గం ఉన్న అర్హులందరికీ సంతృప్త స్ధాయిలో లబ్ధి.

Comments