వరద సహాయం కోసం 8977935609 కంట్రోల్ నంబర్రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);వరద సహాయం కోసం 8977935609 కంట్రోల్ నంబర్ఆగస్ట్ 10 నుంచి 17 వరకు రెండు షిఫ్ట్ ల్లో సిబ్బందిని నియమించడం జరిగింది 


.... కలెక్టర్ మాధవీలత


వరద ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ప్రజల సహాయార్థం కలెక్టరేట్ లో 24 గంటలపాటు కంట్రోల్ రూం నంబర్  8977935609 అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ డా కె. మాధవిలత బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలియచేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతం గా లేదా సమాజపరంగా సహాయం కోరడం కోసం ఈ నంబర్ ఏర్పాటు చేశామని ఆమె తెలిపారు. మొదటి ప్రమాద స్థాయి హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే అధికారులను ముందస్తు చర్యల్లో భాగంగా అప్రమత్తం చేశారు. 


గోదావరి నది కి అధిక మొత్తం లో వరద నీరు చేరుతున్న దృష్ట్యా ఆగస్ట్ 10 నుంచి 17 వరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు, సాయంత్రం 6 నుంచి తరువాత రోజు 6 గంటల వరకు సిబ్బందిని కంట్రోల్ రూం లో విధులు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి షిఫ్ట్ లో ఇద్దరు చొప్పున అందుబాటులో ఉండి ప్రజల నుంచి, అధికారుల నుంచి వచ్చే కాల్స్ రికార్డ్ చేసి, సంబందించిన అధికారులకు తెలియచేయడం జరుగుతుందని మాధవీలత పేర్కొన్నారు.
Comments