ప్రతి ఒక్కరిలో జాతీయ భావం, దేశభక్తి పెంపొందుతాయీ


నెల్లూరు (ప్రజా అమరావతి);



స్వాతంత్ర్య సమరయోధుల ఛాయాచిత్రాలు, స్వాతంత్ర్య ఉద్యమ చారిత్రిక ఘట్టాలు, చారిత్రిక కట్టడాలపై     ఏర్పాటు చేసిన చాయా చిత్ర  ప్రదర్శన ద్వారా.. ప్రతి ఒక్కరిలో జాతీయ భావం, దేశభక్తి పెంపొందుతాయ


ని  జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.


"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" కార్యక్రమాల్లో భాగంగా  6వ రోజు శనివారం నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూరిబా కళాక్షేత్రంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, విద్యా శాఖల సంయుక్త అద్వర్యంలో ఏర్పాటు చేసిన  ఛాయాచిత్ర ప్రదర్శనను జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు తిలకించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మీడియా తో మాట్లాడుతూ,  స్వతంత్ర్యోద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన జాతీయ నాయకుల ఘనతను, దేశ కీర్తిని చాటి చెప్పేలా ఏర్పాటు చేసిన ఛాయాచిత్రాలు నేటి సమాజానికి, ప్రత్యేకించి నేటి యువతరానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని, ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను తిలకించి  స్వాతంత్ర్య ఉద్యమ చారిత్రిక ఘట్టాలను తెలుసుకోవాలన్నారు. జాతీయ నాయకుల సేవలను, స్వతంత్ర్యోద్యమంలో వారి పోరాట పటిమను, భారత దేశ కీర్తిని ప్రతిభిభించే ఇలాంటి ఫోటో చిత్రాల ప్రదర్శన నేటి సమాజానికి ఎంతో ఉపయుక్తం అన్నారు. జిల్లా నుండి కూడా ఎంతో మంది స్వతంత్ర్యోద్యమంలో పాలు పంచుకోవడం జరిగిందన్నారు.  జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, విద్యా శాఖల  ఆధ్వర్యంలో చాయా చిత్ర ప్రదర్శనను ఏర్పాటు  చేయడం అభినందనీయం అన్నారు. 


అనంతరం  చాయా చిత్ర ప్రదర్శన ఏర్పాటుకు  కృషి చేసిన జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీ రమేష్ బాబును, వారి సిబ్బందిని, జిలా సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీ ఏం. వేంకటేశ్వర ప్రసాద్ ను, వారి సిబ్బందిని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు శాలువతో  సన్మానించి మెమోంటో లను అందచేశారు. 



ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి.ఈ.ఓ శ్రీమతి వాణి, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ శ్రీమతి ఉషారాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి కనక దుర్గా భవాని తదితరులు పాల్గొన్నారు.



Comments