అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోవడమే మొహర్రం *- అమరవీరుల త్యాగాన్ని స్మరించుకోవడమే మొహర్రం* 


 *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* గుడివాడ, ఆగస్టు 8 (ప్రజా అమరావతి): ఇస్లాం పునర్జీవానికి ప్రాణం పోసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడమే మొహర్రం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ అన్నారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడలో మొహర్రం సందర్భంగా శిష్ట్లా లోహిత్ తన సందేశాన్ని ఒక ప్రకటన ద్వారా తెలిపారు. మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లాం నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందన్నారు. ఇది అరబ్బీ క్యాలెండర్ యొక్క మొదటి నెల అని, ప్రాచీన కాలంలో అరబ్ లు ఈ క్యాలెండర్ ను వాడేవారన్నారు. 14 శతాబ్దాల కిందటే ప్రజాస్వామ్యం, మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటమే మొహర్రం అని అన్నారు. ఇస్లాం అంటే శాంతి అని, మహ్మద్ ప్రవక్త కుటుంబం చేసిన త్యాగాలను మొహర్రం సందర్భంగా స్మరించుకోవడం జరుగుతోందన్నారు. మంచితనం, త్యాగం ఇస్లాం సూత్రాలు అని చెప్పారు. మానవతా వాదాన్ని వెలువరించే స్పూర్తిగా మొహర్రంను అభివర్ణించారు. తెలుగు ప్రాంతాల్లో మొహర్రంను వందలాది ఏళ్ళుగా ముస్లింలతో పాటు అన్నివర్గాల ప్రజలు జరుపుకుంటూ వస్తున్నారని శిష్ట్లా లోహిత్ చెప్పారు.

Comments