నెల్లూరు, ఆగస్టు 1 (ప్రజా అమరావతి):-- ప్రజల నుండి అందే స్పందన అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి సకాలంలో పరిష్కరించాల
ని జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మానాధ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ఉదయం నెల్లూరు నగరం కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మానాద్ డిఆర్ఓ శ్రీమతి వెంకటనారాయణమ్మ, తెలుగు గంగ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ శ్రీ టి బాపిరెడ్డి, డిఆర్డిఏ పిడి శ్రీ సాంబశివరెడ్డితో కలసి స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా
ఓటర్ కార్డుతో ఆధార్ నంబరు అనుసంధానం చేసే ప్రక్రియను జిల్లాలో ప్రారంభిస్తూ సంయుక్త కలెక్టర్ గోడపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు ఇందులో భాగంగానే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ కార్డుకు ఆధార్ నంబరు అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో డిటిసి శ్రీ చందర్ జిల్లా వ్యవసాయ అధికారి జి శ్రీ సుధాకర్ రాజు డిపిఓ శ్రీమతి ధనలక్ష్మి , డి ఆర్ డి ఏ , డ్వామ పిడీలు శ్రీ సాంబశివరెడ్డి, శ్రీ తిరుపతయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీ వెంకటయ్య, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పెంచలయ్య డిఎస్ఓ శ్రీ వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ జెడి శ్రీ మహేశ్వరుడు, కార్మిక శాఖ ఉప కమిషనర్ శ్రీ వెంకటేశ్వర్లు, డి సి ఓ శ్రీ తిరుపాల్రెడ్డి సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా ఎస్సీ సంక్షేమం సాధికారత అధికారి శ్రీమతి రమాదేవి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment