కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించకుండా అడ్డుకోవడం దారుణం



 *- కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించకుండా అడ్డుకోవడం దారుణం* 


 *-  అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయడం దుర్మార్గం* 

 *- వైసీపీ దాడిని ఖండించిన ఆప్కాబ్ మాజీ చైర్మన్ పిన్నమనేని* 

 *- బెదిరింపులకు భయపడేది లేదన్న పిన్నమనేని బాబ్జి* 



గుడివాడ , ఆగస్టు 25 (ప్రజా అమరావతి): కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును పర్యటించనీయకుండా వైసీపీ అల్లరి మూకలు అడ్డుకోవడం దారుణమని ఆప్కాబ్ మాజీ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, టీడీపీ సీనియర్ నేత పిన్నమనేని బాబ్జిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక భాస్కర్ థియేటర్లోని కార్యాలయంలో వారు విలేఖర్లతో మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటన కొనసాగుతోందని చెప్పారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డుపడడం దుర్మార్గమని అన్నారు. కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అన్నా క్యాంటీన్ ను ప్రారంభించడాన్ని వైసీపీ ప్రభుత్వం తట్టుకోలేక పోతోందన్నారు. పేదవాడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ ను ప్రారంభించనీయకుండా ధ్వంసం చేయడం దారుణమన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే గాక టీడీపీ క్యాడర్ ను నిర్వీర్యం చేయాలన్న కుట్రలో భాగంగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత పర్యటనకు అడ్డంకులు సృష్టించడం ద్వారా రాష్ట్రమంతా ఇవే పరిస్థితులు ఉంటాయన్న సందేశాన్ని వైసీపీ శ్రేణులు ప్రజల్లోకి పంపుతున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు ఇటువంటి దుశ్చర్యలను సమర్ధవంతంగా తిప్పికొట్టడం జరుగుతుందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయని, వైసీపీ అల్లరి మూకల చర్యలను ప్రజలు దగ్గరగా గమనిస్తున్నారని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గానికి 30 ఏళ్ళు ఎమ్మెల్యేగా, రాష్ట్రానికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని, అయినప్పటికీ పోలీసులు సరైన భద్రతా చర్యలు చేపట్టలేదన్నారు. పోలీసులు సమక్షంలోనే అల్లర్లను ప్రేరేపించడం సరికాదన్నారు. వీటికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయపడే పరిస్థితి లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తెలుగుదేశం పార్టీ నడుచుకుంటోందని, పార్టీ అధినేత చంద్రబాబు, ముఖ్య నేతలపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. కుప్పం ఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image