నెల్లూరు, ఆగస్టు 18 (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేక, ఓర్వలేక ప్రతిపక్షాలు పనిగట్టుకుని లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయ
ని, ఇండియా సర్వే ఫలితాలు కూడా రాష్ట్రంలో మళ్లీ వై ఎస్ ఆర్ సి పి అధికారంలోకి వస్తుందని ప్రకటించడం తమ ప్రభుత్వ పనితీరుని నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని మనుబోలు మండలం కొలనుకుదురు గ్రామంలో గురువారం సాయంత్రం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక ప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి పాల్గొన్నారు.
కొలనుకుదురు ఎస్టీ కాలనీలో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టో లోని హామీలను 99 శాతం అమలు చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్తిగా స్థాయిలో సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఇంకా ఎవరైనా అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందకపోయినా, గ్రామములో పరిష్కరించాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుని పరిష్కార మార్గం చూపే ప్రయత్నమే గడపగడపకు మన ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో మనుబోలు మండల ఎంపీపీ వజ్రమ్మ, జెడ్ పి టి సి చిట్టమూరు అనితమ్మ, ఎంపీడీవో శ్రీ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ శ్రీ సుధీర్ బాబు, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment