స్వామి వారికి పట్టు వస్త్రాలు బహుకరించే భాగ్యాన్ని కలిపించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు

 

నెల్లూరు (ప్రజా అమరావతి);



వెంకయ్య స్వామి ఆశీస్సులతో అవదూత శ్రీ శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి తొమ్మిదవ సారి  పట్టు వస్త్రాలు సమర్పించే  భాగ్యాన్ని కలిపించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.


వెంకటాచలం మండలం, గొలగమూడిలో  శ్రీ శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి 40వ ఆరాధన మహోత్సవాలు సందర్భంగా ఉత్సవాలలో ప్రధానమైన ఆరాధనోత్సవాల్లో బుధవారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి దంపతులు పాల్గొని  స్వామి వారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించి  స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంధర్భంగా  మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి  మీడియాతో మాట్లాడుతూ, వెంకయ్య స్వామి వారి ఆశీస్సులతో వరుసగా 9వ సారి ఆరాధన ఉత్సవాలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం తనకు కలిగిందని  పేర్కొన్నారు.  ఏపీకి శ్రీ  జగన్ మోహన్ రెడ్డి  గారు శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు ఈ సందర్భంగా మంత్రి  తెలిపారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు బహుకరించే భాగ్యాన్ని కలిపించిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు


తెలియచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  విశేష ఆదరణ పొందుతున్న శ్రీ వెంకయ్య స్వామి ఆలయం ఎంతో అభివృద్ది చెందడంతో పాటు  రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు సమకూరాయని మంత్రి శ్రీ  కాకాణి  గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆస్తుల పరిరక్షణకు ఈవో  శ్రీ బాలసుబ్రమణ్యం, పాలకమండలి చిత్తశుద్ధితో పనిచేస్తుందంటూ మంత్రి గోవర్ధన్ రెడ్డి అభినందనలు తెలిపారు. స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

అనంతరం భగవాన్ శ్రీ శ్రీ శ్రీ వెంకయ్య  స్వామి  వారి రధోత్సవ కార్యక్రమాన్ని మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి ప్రారంభించి  రధాన్ని లాగడం జరిగింది.  తదుపరి మంత్రి  నిత్యాన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజనం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ శ్రీ మలోల, తహశీల్దార్ శ్రీ నాగరాజు, ఎంపిడిఓ శ్రీమతి సుస్మిత,   మండల ప్రజాప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.




Comments