ఏపీ వైద్య ఆరోగ్య శాఖ
*హెచ్ ఐవి నివారణ పై
రాష్ట్రంలోని వైఎస్సార్ పట్టణ ఆరోగ్య కేంద్రాల సిబ్బందికి శిక్షణ*
*ఎపి శాక్స్ కార్యాచరణ ప్రణాళిక*
అమరావతి (ప్రజా అమరావతి);
హెచ్ఐవి నివారణా , నియంత్రణ సేవల్ని మరింత చేరువ చేసే క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ(ఏపీ శాక్స్ ) వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ ల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాల్లోని వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ ల సిబ్బందికి ఇప్పటికే శిక్షణ కార్యాక్రమాన్ని ఏపీ శాక్స్ ప్రారంభించింది. ఎన్టీఆర్ జిల్లాలో 48, కృష్ణాజిల్లాలో 13
వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. వీటన్నిటిలోనూ హెచ్ఐవి కి సంబంధించి సేవల్ని మెరుగుపర్చేందుకు ఇప్పటికే ఏపీ శాక్స్ చర్యలు మొదలు పెట్టింది. హెచ్ ఐవి స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించి
రాష్ట్రంలో ని అన్ని వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లలోని ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులకు తగిన శిక్షణ ఇచ్చేందుకు ఎపి శాక్స్ కార్యాచరణ రూపొందించింది. హెచ్ ఐవి స్క్రీనింగ్ పై పీహెచ్సీలలోని సిబ్బందికి ఇప్పటికే అవగాహన ఉంది. వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ లలోని సిబ్బందికి కూడా దీనిపై అవగాహన కల్పించేందుకు ఎపి శాక్స్ ప్రత్యేక కార్యాచరణ ను రూపొందించింది.
విజయవాడ
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఉన్న స్టేట్ రిఫరెన్స్ లేబరేటరీ ఆధ్వర్యంలో ఏపీ శాక్స్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించింది. హెచ్ఐవి పరీక్ష కు సంబంధించి సేవల్ని వైయస్సార్ అర్బన్ క్లినిక్స్ స్థాయిలో పటిష్టపరిచేందుకు చేపట్టిన ఈ శిక్షణా కార్యక్రమం సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతోందని ఎపి శాక్స్ ఎపిడి డాక్టర్ ఉమాసుందరి ఈ సందర్భంగా తెలిపారు. టెస్ట్ కిట్స్ కి సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలు , అలాగే కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ గురించి ల్యాబ్ టెక్నీషియన్లకు పలు సూచనలు చేసినట్లు ఆమె తెలిపారు.
" భారత ప్రభుత్వం నిర్దేశించిన 95- 95 -95 లక్ష్యాలను చేరుకోవడంలో సిబ్బంది కృషి చేయాలి. రిస్క్ లో ఉన్న అందరూ హెచ్ఐవి పరీక్షను విధిగా చేయించుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ లో హెచ్ఐవికి సంబంధించిన పరీక్ష ను అందుబాటులోకి తీసుకొచ్చాం.
ప్రతి గర్భిణి విధిగా తను గర్భం దాల్చిన సమయంలో హెచ్ఐవి పరీక్షను చేయించుకోవాలి. అర్బన్ క్లినిక్స్ లో ఉన్న సిబ్బంది పరీక్షించిన తర్వాత రిపోర్టు లను గర్భిణిలకు ఎం సి హెచ్ కార్డు పై తప్పకుండా నమోదు చేయాలి. వైయస్సార్ అర్బన్ క్లినిక్స్ లో గర్భిణిలతో పాటుగా ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో నడిచే స్వచ్ఛంద సేవా సంస్థలు తీసుకొచ్చే రిస్క్ గ్రూపు వారికి కూడా పరీక్షలు నిర్వహించాలి" అని
ఎపి శాక్స్ జెడి
డాక్టర్ కామేశ్వర ప్రసాద్ తెలిపారు.
"వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ లో హెచ్ఐవి, క్యాన్సర్ కు సంబంధించి సేవల్ని మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.
హెచ్ఐవి పరీక్ష చేసే విధానం , తీసుకోవలసిన జాగ్రత్తలు, ల్యాబ్ ప్రోటోకాల్స్ , రిజిస్టర్ రికార్డ్స్ రిపోర్టింగ్ గురించి శిక్షణ ఇస్తున్నాం" అని
ప్రెప్ ఫర్ సమన్వయకర్త
డాక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
addComments
Post a Comment