శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానము
, ఇంద్రకీలాద్రి,విజయవాడ (ప్రజా అమరావతి):
దేవస్థానము నందు ది.19.08.2022, శ్రీ శుభకృత్ నామ సంవత్సర బహుళ అష్టమి, శుక్రవారము రోజున శ్రీ కృష్ణాష్టమి పర్వదినమును పురస్కరించుకొని శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారి సమక్షంలో ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారి ఆధ్వర్యంలో ఆలయ అర్చక బృందంచే శ్రీ అమ్మవారి ప్రధానాలయము నందు శ్రీ కృష్ణ భగవానునికి పూజ, గోశాల యందు గోమాత కు గో-పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వారు పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కార్యక్రమ వివరములు:
శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత కృష్ణ భగవానులకు షోడశోపచార పూజ, నివేదన, హారతి, నీరాజన మంత్ర పుష్పములు ఇత్యాది పూజా కార్యక్రమాలు, గోశాల యందు గో-ప్రదక్షిణలు నిర్వహించి గో-పూజ కార్యక్రమములు నిర్వహించడమైనది.
అనంతరం సాయంత్రం దేవస్థాన పురాణ పండితులచే ఉపన్యాసము నిర్వహించడం జరిగినది.
*ఉట్టికొట్టు వేడుక:
సా.06.30 గం.లకు రాజగోపురం ఎదురుగా గల ప్రాంగణము నందు ఉట్టి కొట్టు వేడుక నిర్వహించగా శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు మరియు ఆలయ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యుల వారు ఉట్టి కొట్టు వేడుక యొక్క విశిష్టిత తెలియజేశారు.
addComments
Post a Comment