కష్టజీవి, సామజిక కార్యకర్త గుత్తా మునిరత్నం నాయుడు గారు : సి జె ఐ
తిరుపతి, ఆగస్టు 19 (ప్రజా అమరావతి): కష్టజీవి సామజిక కార్యకర్త దివంగత పద్మశ్రీ గుత్తా మునిరత్నం నాయుడు అని అయన స్థాపించిన ఈ సంస్థ ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవలందించి, అంకితం చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ అన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రాస్ ప్రధాన కార్యాలయ ఆవరణలోడా. గుత్తా మునిరత్నం నాయుడు గారి విగ్రహావిష్కరణ ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ గ్రామీణప్రజలపై , వ్యవసాయం పై రైతులకు అండగా వుండాలని, పట్టణ పేదల సమస్యలకు పరిష్కారం చూపాలని , విభిన్న ప్రతిభావంతులకు తోడుగా వుండాలని ఎన్నో రాస్ సంస్థ స్థాపించి సామజిక కార్యక్రమాలు చేపట్టి పరిష్కారం చూపారని అన్నారు. ఎస్.జి.రంగా , రాజగోపాల నాయుడు వంటి స్వతంత్ర సమారయోదుల ఆశ్వీరాదాలతో సంస్థ వున్నత స్థితితో దాదాపు 21 కార్యక్రమాలను తమిళనాడు ,ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వేలమందికి మార్గదర్శిగా నిలిచి సేవలందిచారని అన్నారు. మహా కవి గురుజాడ స్పూర్తితో దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ , దేశమును ప్రేమించుమన్నా .. మంచి అన్నదని పెంచుమన్నా .. స్వంతలాభం కొంత మానుకుని పొరుగు వారికి తోడ్పడవోయ్ అన్న మాటలతో అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న మునిరత్నం నాయుడు గారికి ఘనంగా నివాలులర్పిస్తునానని అన్నారు. చేసిన సేవలు చిరస్మరణీయం అందుకే ఆయనకు పద్మశ్రీ ప్రధానం చేయడం అతనికి సామాజిక సేవ పట్ల అంకితభావం నిబద్ధత తెలుస్తుందని అన్నారు. నేడు దివంగత కొత్త మునిరత్నం నాయుడు గారి విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు.
అనంతరం రాస్ ముద్రించిన సేవా కార్యక్రమాల పుస్తకాని భాతర ప్రధాన న్యాయమూర్తి ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో రాస్ స్వంత సుందర వడివేలు , సెక్రటరీ వెంకటరత్నం, రాస్ సంక్షేమ సంస్థల ప్రతినిధులు, లబ్దిదారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
addComments
Post a Comment