జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం"తో పరిశ్రమలకు కొత్త ఊపిరి : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి*"జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం"తో పరిశ్రమలకు కొత్త  ఊపిరి : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి*


*ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్లాట్ల కేటాయింపు పత్రాల పంపిణీ చేసిన ఛైర్మన్*


అమరావతి, ఆగస్ట్, 03 (ప్రజా అమరావతి): "జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం" పరిశ్రమలకు కొత్త  ఊపిరి పోసిందని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 572 పరిశ్రమలకు జీవో నెం-7 పునరుజ్జీవం నింపిందన్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఏ  ఇబ్బంది వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పందించే విధానమే ప్రత్యేకమన్నారు. అనంతపురం జిల్లా  ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కార్యాలయంలో  22 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్లాట్ల పునరుద్ధరణకు సంబంధించిన పత్రాలను ఛైర్మన్ అందజేశారు.  421 మంది పారిశ్రామికవేత్తలకు పాత ఎస్టేట్‌ లోని అదే ప్రాంతంలో ప్లాట్‌ కేటాయించనున్నట్లు ఛైర్మన్ స్పష్టం చేశారు. ఫిబ్రవరి 5న ప్రభుత్వం విడుదల చేసిన జీవో అమలుపై బడుగు, బలహీనవర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. కోల్పోతామనుకున్న తమ ప్లాట్లలోనే  పరిశ్రమలను పున: ప్రారంభించేలా ప్రభుత్వం మరో అవకాశం కల్పించడం పరిశ్రమల ప్రగతి పట్ల ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పారిశ్రామికవేత్తలు నాడు ప్లాట్లు- పొందిన నాటి పాత ధరలనే వర్తింపజేయడం, ఎటు-వంటి అపరాధ రుసుము లేకుండా నగదు చెల్లించే ఈ అవకాశం వల్ల వందలాది పరిశ్రమలు మళ్ళీ పున: ప్రారంభించుకునే అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అన్ని భూ కేటాయింపులను లీజు నుంచి అమ్మకం(ఓఆర్‌ఎస్‌-ఔట్‌ రేజ్‌ సేల్‌) పద్ధతిలోకి మార్చడం, దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు తిరిగి కేటాయింపులకు సంబంధించిన లెటర్లు ఇవ్వడం, యూనిట్‌ ని పూర్తి చేసేందుకు ఏప్రిల్‌ 1 , 2022 నుంచి మరో మూడేళ్ళ వరకూ కాలపరిమితిని పెంచడం వంటి వెసులుబాటుతో వందలాది కుటుంబాలకు కొండంత అండగా మారినట్లు ఆయన పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో అనంతపురం జోనల్ మేనేజర్ మురళీ మోహన్ , పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ నాగరాజు రావు , యూనియన్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.  Comments