నిరుద్యోగ యువతీ యువకులు మెగా జాబ్ మేళాను ఉపయోగించుకోవాలి.


                                                                        గుంటూరు (ప్రజా అమరావతి);


                               


తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలలో నివసించే నిరుద్యోగ యువతీ యువకులకు తమ సంస్థ ద్వారా చేయూతనివ్వాలనే సంకల్పంతో మెగా జాబ్ మేళా ను ఏర్పాటు చేసినట్లు హార్వెస్ట్ ఇండియా అధినేత వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు శ్రీ కత్తెర సురేష్ కుమార్ గారు వెల్లడించారు.  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేశామన్నారు.  హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా ఎంతో మందికి విద్య అందించడమే కాక అనేకమందికి చేయూతను ఇస్తున్నట్టు వెల్లడించారు. దానిలో భాగంగానే ఈనెల 28వ తేదీన గుంటూరు ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి కత్తెర హెనీ క్రిస్టినా గారి జన్మదిన సందర్భంగా కె .ఎస్ .కె గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. భట్టిప్రో లు లోని కె ఎస్ కే కళాశాలలోఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు రాష్ట్ర మంత్రి శ్రీ మేరుగా నాగార్జున గారు ఈ జాబ్ మేళా ను ప్రారంభిస్తారని సురేష్ కుమార్ గారు  వెల్లడించారు. ఈ సందర్భంగా 35 కంపెనీలలో జాబులు పొందే విధంగా అవకాశాలు కల్పించమన్నారు. పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ ,ఐటిఐ, డిప్లమో, బీటెక్, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, జీవన్ ఎం అండ్ ఏ ఎన్ ఎం, అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని చెప్పారు. హైదరాబాద్, బెంగళూర్, చెన్నై వంటి పట్టణాలతో పాటు తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలోని నిరుద్యోగ యువకులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఏడాది ఇదే విధంగా జాబు మేళ నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే సంవత్సరం 100 కంపెనీలతో మాట్లాడి అత్యధిక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సన్నహాలు చేస్తున్నట్లు ప్రకటించారు .ఈ సువర్ణ అవకాశాన్ని నిరుద్యోగులైన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  

                                             

Comments