హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: సిఎస్

 హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: సిఎస్విజయవాడ:12 ఆగస్టు (ప్రజా అమరావతి): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈమేరకు శుక్రవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ఆయన సంబంధిత శాఖల అధికారులతో వీడియో సమావేశం ద్వారా ఏర్పాట్లను సమీక్షించారు.ఈసంధర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈనెల 13 నుండి 15 వరకు ప్రతి ఇంటిపైనా,ప్రతి కార్యాలయం పైన,ప్రతి భవనం పైన జాతీయ జెండా ఎగరాలని చెప్పారు. ఇప్పటికే గత వారం రోజులకు 

పైగా రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై సిఎస్ డా.సమీర్ శర్మ అధికారులతో సమీక్షించారు.


ఈ వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమానికి సంబంధించి ఇప్పటి వరకు చేపట్టిన రోజు వారీ కార్యక్రమాలు గురించి సిఎస్ కు వివరించారు.ప్రతి గృహంపై జాతీయ జెండాను ఎగుర వేసేలా ప్రజలను చైతన్య పర్చడం జరిగిందన్నారు.ఈనెల 1వతేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగాకు సంబంధించి పలు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో భాగంగా 7వతేదీన మండల,జిల్లా కేంద్రాల్లో సైకిల్ ర్యాలీలు,10వ తేదీన పోస్టర్ మేకింగ్ పోటీలు, 11న హెరిటేజ్ వాక్ లు నిర్వహించినట్టు తెలిపారు. అదే విధంగా ముఖ్య పట్టణాలు,నగరాల్లో ప్రముఖ కూడళ్ళలో ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు తోపాటు మీడియా బ్రీఫింగ్,లు, స్వచ్చాగ్రహ కార్యక్రమాలు నిర్వహించినట్టు రజత్ భార్గవ వివరించారు.12న పంచాయితీ రాజ్ సంస్థలన్నిటిలో ఆటల పోటీలను నిర్వహించామని అన్నారు.13న జాతీయ జెండా తో సెల్ఫీ దిగేలా విద్యార్ధులు, యువత తదితరులను చైతన్య వంతం చేసినట్టు తెలిపారు.14న స్వాతంత్య్ర సమరయోధులు ఇళ్ళకు నడక కార్యక్రమం,15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసేలా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని రజత్ భార్గవ చెప్పారు.


ఈవీడియో సమావేశంలో ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు డిజిపి ఎస్.బాగ్సి, ఉన్నత విద్యా మండలి అధ్యక్షులు హేమచంద్రారెడ్డి పాల్గొనగా వీడియో లింక్ ద్వారా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ముఖ్య కార్యదర్శి వాణి మోహన్, సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.Comments
Popular posts
అర్హులైన వారందరికీ వర్తించేలా వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఆరవ రోజున శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ మహాలక్ష్మి గా దర్శనమిస్తారు.
Image
శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఏడవ రోజున శ్రీ కనక దుర్గమ్మ వారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనం ఇస్తారు.
Image
అక్టోబరు 25న ఇ–క్రాపింగ్‌ జాబితాలు సచివాలయాల్లో ప్రదర్శన, షెడ్యూల్‌ వివరించిన సీఎం.
Image
భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.
Image