తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం కలగడం నిజంగా జిల్లా ప్రజల పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను

 


నెల్లూరు,ఆగస్టు17 (ప్రజా అమరావతి):

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం కలగడం నిజంగా జిల్లా ప్రజల  పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాన



ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్  శాఖ మంత్రివర్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.


నెల్లూరు నగరంలోని ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం- విపిఆర్ ఫౌండేషన్ యొక్క సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర  వైభవోత్సవ కార్యక్రమంలో బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్యులు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి తో కలిసి స్వామివారిని దర్శించుకుని  తోమాల సేవా కార్యక్రమంలో  పాల్గొన్నారు.


ఈ సందర్భంగా

రాష్ట్ర మంత్రివర్యులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ  వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల అభివృద్ధి కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి  ప్రాశస్తాన్ని మరింత విస్తరింప చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. ఇందులో భాగంగానే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి, కార్యనిర్వహణ అధికారి శ్రీ ఏవి ధర్మారెడ్డి సహకారంతో రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిల  సౌజన్యంతో వైభవోత్సవాలను అత్యంత ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నామన్నారు.


ప్రతినిత్యం నెల్లూరు వాసులు నిద్రలేచిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని  దర్శించుకున్నామనే సంతృప్తిని, అత్యంత ఆనందాన్ని పొందగలుగుతున్నారన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుంటూ ఏదో వచ్చాము సేవలు చూసి వెళ్ళాము అని కాకుండా సేవలకు ఉన్న విశిష్టతను కూడా ప్రధాన అర్చకులు వివరిస్తున్నారని తద్వారా ప్రతి ఒక్కరిలో దేవుని పట్ల భక్తి భావం పెంపొందుతోందన్నారు. స్వామివారి వైభవోత్సవాలను భగవంతుడు జిల్లా ప్రజలకు ప్రసాదించిన ఒక వరం అన్నారు. ఈ ఉత్సవ కార్యక్రమాలు ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతాయని జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తిరుమలలో శ్రీవారికి జరిగే అన్ని రకాల సేవలు అదే తరహాలో ఇక్కడ జరుగుతున్నాయన్నారు. నిజంగా స్వామివారి విగ్రహాన్ని దర్శిస్తే తిరుమలలో ఉన్న స్వామి సాక్షాత్తు మూలవిరాట్ ను దర్శించుకున్నట్లుగా ఉందన్నారు. జిల్లా ప్రజలందరూ స్వామివారిని దర్శించుకుని దేవుని కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు. ఇంతటి మంచి కార్యక్రమాన్ని జిల్లాకు తీసుకువచ్చిన రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి  హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి,  న్యూఢిల్లీ శ్రీ వెంకటేశ్వర దేవస్థానం స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments